Mohan Babu: మోహనబాబు ఇష్యూలో మీడియా చేసిన తప్పేంటి? అసలు ఏం జరిగింది?

| Edited By: Ram Naramaneni

Dec 12, 2024 | 8:38 PM

కొద్ది రోజులుగా మంచు వారింట అంతా గందరగోళ పరిస్థితి. ఎవరింటి గొడవలు వారింట ఉంటాయి అంటారు. కరెక్టే. కానీ ఆ ఇంటి గొడవ గడప దాటితే.. అది సెలబ్రెటీ ఇంట జరిగితే.. పోలీస్ కేసులు నమోదయ్యే వరకు వెళితే... అప్పుడు ఆటోమేటిగ్గానే అది ఇష్యూ అవుతుంది. పబ్లిక్ కు ఇంట్రస్ట్ పెరుగుతుంది. మీడియా కవరేజ్ మొదలవుతుంది. మోహన్ బాబు ఇంటి విషయంలోనూ ఇదే జరిగింది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో దారుణమైన అంశాలు చోటుచేసుకున్నాయి.

మోహన్ బాబు ఇంట వివాదానికి సంబంధించి న్యూస్ కవర్ చేస్తున్న టీవీ9 ప్రతినిధి రంజిత్ పై అకారణంగా దాడికి దిగారు మోహన్ బాబు. ఈ దాడిలో రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. చివరకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కోలుకోవడానికి కొద్ది రోజులు పడుతుంది. దీనికి బాధ్యులెవరు? మీడియాపై దాడిని జర్నలిస్ట్ లోకం తీవ్రంగా ఖండించింది. తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు భగ్గుమన్నాయి. సోషల్ మీడియాలోనూ, సమాజంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

Published on: Dec 12, 2024 08:38 PM