అప్పడాలు ఇష్టమని లొట్టలేసుకొని లాగించేస్తున్నారా..!

Updated on: May 15, 2025 | 12:54 PM

గతంలో ఇంట్లోనే అప్పడాలు తయారు చేసుకునేవారు. కానీ ప్రస్తుతం అందరూ దుకాణాల నుంచే అప్పడాలు కొనుగోలు చేస్తున్నారు. గతంలో అప్పడాలు ప్రతి ఇంట్లో ప్రధాన ఆహారంగా ఉండేది. అది కూడా ఇంట్లో తయారుచేసిన అప్పడాలు కావడంతో ప్రతిరోజు భోజనంలో తీసుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.  కొందరు వ్యాపారులు అపరిశుభ్రంగా వీటిని తయారుచేయడం వల్ల వినియోగించేవారు రోగాల బారిన పడుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యం నుంచి గుమ్మడి వరకు రకరకాల అప్పడాలు తయారు చేస్తుంటారు. వీటిని తినడం వల్ల కేలరీలు తక్కువగా అందుతాయని మనం అనుకుంటాం. కానీ అరచేయ్యంత అప్పడంలో దాదాపు 13 గ్రాముల పోషకాలు ఉంటాయి. ఇందులో 35 టు 40 గ్రాముల కేలరీలు, 0.42 గ్రాముల కొవ్వు ఉంటుంది. అలాగే 3.3 గ్రాముల పోషకాలు ఉంటాయి. ఇందులో 7.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 226 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. అందుకే వీటిని వారానికి ఒకసారి లేదా అరుదుగా తినడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. అప్పడాల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో ఉప్పు, సోడియం ఆధారిత పదార్థాలు ఇందులో ఉంటాయి. అధిక సోడియం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, మూత్రపిండాల రుగ్మతలు, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అధిక సోడియం స్థాయిలో కలిగిన ప్రాసెస్ చేసిన ఆహారాలు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. అప్పడాల వల్ల అక్రిలామైడ్ ప్రమాదం ఉంది. కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే వీటిని వేయించడం వల్ల అక్రిలామైడ్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల కాన్సర్, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అప్పడాలు ప్యాక్ చేసి మార్కెట్లకు అందిస్తారు. దాని రుచిని కాపాడడానికి వారు కృత్రిమ రంజులతో పాటు పాడవకుండా ఉండటానికి రసాయనాలను ఉపయోగిస్తారు. దీనివల్ల జీర్ణ సమస్యలు, ఆమ్లత్వం పెరుగుతాయి. మీరు హోటళ్లలో భోజనం చేసినప్పుడు అధనంగా అప్పడాలు వడ్డిస్తారు. రుచిగా ఉన్నాయని అతిగా తినకుండా మితంగా తీసుకుంటే మంచిది. అసలు మార్కెట్లో దొరికే అప్పడాలను ఉపయోగించకుండా ఇంట్లో తయారుచేసుకోవడం ఆరోగ్యకరం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజూ ఒక్క పండు తింటే.. ఉక్కులా తయారవుతారు

Balakrishna: రజినీని రికార్డ్‌ను బద్దలు కొట్టిన బాలయ్య

సొంత తండ్రి నుంచే దారుణ వేధింపులు.. ఏడుస్తూ చెప్పిన హీరోయిన్