ఏపీలో ఓ వైపు సంబరాలు.. మరోవైపు నిరసనలు..
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తూ సంబరాలు చేసుకుంటుండగా, మరోవైపు పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాల మార్పులు, పేర్ల వివాదాలు, మండల విభజనపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన అనంతర పరిస్థితులు మిశ్రమ స్పందనతో కొనసాగుతున్నాయి. ఒకవైపు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సంబరాలు అంబరాన్నంటాయి. మార్కాపురం జిల్లా ఆవిర్భావం పండుగ వాతావరణంలో జరిగింది, కలెక్టర్ కార్యాలయం ప్రారంభమైంది. రంపచోడవరంలో పోలవరం నూతన జిల్లా కార్యాలయాన్ని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంపై స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆధ్వర్యంలో కృతజ్ఞతా ర్యాలీ జరిగింది. సత్యసాయి జిల్లా మడకశిరలో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజు ప్రారంభించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్
దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త..జనవరి 1 నుంచి
