Rain Alert: ఏపీని వదలని వరుణుడు.. ఈనెల 5 నుంచి భారీ వర్షాలు

Updated on: Nov 04, 2025 | 7:21 PM

మోంథా తుఫాను ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే, నవంబర్ 5 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ఇటీవల సంభవించిన మోంథా తుఫాను ఏపీలోని పలు జిల్లాలను అతలాకుతలం చేసింది. ఈ విపత్తు నుంచి ప్రజలు ఇంకా పూర్తిగా తేరుకోకముందే, రాష్ట్ర వాతావరణ శాఖ మరోసారి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వర్ష సూచన అలర్ట్‌ జారీ చేసింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నవంబర్ 5వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

40 ఏళ్లు దాటాక.. ఇవి తినాలంటున్న నిపుణులు

పండ్ల మీద స్టిక్కర్లు.. వాటిపై నంబర్లు.. దేనికి ??

Gold Price: బంగారం రేటు తగ్గింది.. ఇవాళ తులం ఎంతంటే ??

Earth Quake: విశాఖలో భూప్రకంపనలు..భయంతో జనం పరుగులు

Bigg Boss Madhuri: మాధురి రెమ్యూనరేషన్ ఎంతంటే ??