వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

Updated on: Dec 27, 2025 | 9:27 PM

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రికార్డు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలితో పాటు హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం నమోదవుతోంది. AQI 230 దాటింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనవరిలో కూడా చలి కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.. పగటిపూట ఎండ కాస్తున్నప్పటికీ.. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి రాత్రివేళల్లో రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది.. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రెండు, మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో చలి వణికిస్తోంది. చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా, సంక్రాంతికి మళ్లీ చలి పెరిగి, చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నాలుగైదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు.. 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి.. ఇటు వాయు కాలుష్యం హైదరాబాద్‌ను చుట్టుముట్టింది. భాగ్యనగరంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 230 దాటి ప్రమాదకర స్థాయికి చేరింది. గరిష్టంగా అమీన్‌పూర్‌ 289 పాయింట్లు.. గచ్చిబౌలిలో 286.. మాదాపూర్‌ లో 230 పాయింట్లుగా నమోదైంది. సనత్‌నగర్, కూకట్‌పల్లి, బాలానగర్, సోమాజిగూడ, కోటి, బంజారా హిల్స్, మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బొల్లారం ఇండస్ట్రీయల్ ఏరియాతో పాటు నగరంలో పలు ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 పాయింట్లు దాటింది. చలి, పొగ మంచు కారణంగా వాయు కాలుష్యం పెరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట

ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్