నడిరోడ్డుపై రౌడీయిజం.. అదే రోడ్డుపై పోలీసుల ట్రీట్ మెంట్

Updated on: Oct 08, 2025 | 7:11 PM

ఏపీ పోలీసులు కొత్త ట్రెండ్‌ ఫాలో అవుతున్నారు. నేరాలకు పాల్పడుతున్న నిందితులకు వెరైటీ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చిత్తూరులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను చేతులకు సంకెళ్లు వేసి కోర్టు దాకా నడిపించుకుంటూ వెళ్లి.. డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. తాజాగా టెంపుల్‌ సిటీ తిరుపతిలోనూ ఇద్దరు రౌడీ షీటర్స్‌ హల్ చల్ చేస్తే ఇదే తరహా ట్రీట్‌మెంట్ ఇచ్చారు.

తిరుపతిలోని టీవీఎస్ షోరూం సర్కిల్ వద్ద రోడ్డుపై కత్తి తో హల్చల్ చేసిన రౌడీ షీటర్ తో పాటు అతని స్నేహితున్ని అరెస్టు చేశారు. అనంతరం ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. విక్టరీ వైన్ షాపు వద్ద కత్తులతో హల్ చల్ చేసి భయాందోళనకు గురి చేసిన రౌడీ షీటర్ ఫిరోజ్, సయ్యద్ భాషల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులో తీసుకున్నారు. వారిపై మారణాయుధాల వాడకంతో పాటు ఇతర సెక్షన్స్‌ కింద కేసు నమోదు చేసి.. ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు ప్రాంగణం వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అందరూ చూసేలా చేతులకు బేడీలు వేసి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. నేరం చేసినా, అసాంఘిక శక్తులుగా వ్యవహరించినా.. ఇలాంటి శిక్ష తప్పదని తెలియజేశారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర నడిపించగా నిందితుల్ని జనం ఆసక్తిగా చూశారు. ఈ చర్యతో సమాజంలో భయ బ్రాంతులు సృష్టించే వారిపట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తామో అని చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైవేపై కుప్పకూలిన హెలికాప్టర్‌.. సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌

ఏ భాష మెసేజైనా మీ భాషలో చదువుకోవచ్చు.. వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌

కొడుకు అలిగాడని అప్పు చేసి బైక్‌ కొనిస్తే.. రెండు రోజులకే యాక్సిడెంట్‌లో మృతి

ఆ కారుకు తరచుగా రిపేర్లు.. యజమానికి రూ.కోటి ఇవ్వాలన్న కన్జ్యూమర్ కోర్టు

Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే ??