Explainer: మందు బాబులకు గుడ్ న్యూస్ !! కొత్త మద్యం పాలసీలో

|

Aug 10, 2024 | 12:14 PM

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ రానుంది. నాణ్యత విషయంలో రాజీ లేకుండా.. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేలా కొత్త పాలసీ తయారీకీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పాలసీ తయారీ కోసం అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తోంది ఏపీ సర్కార్. దేశంలో ఇతర రాష్ట్రాల్లో మద్యం పాలసీలు ఏ విధంగా ఉన్నాయి.. ఆ పాలసీ వల్ల ఎదురయ్యే సమస్యలు ఏమిటి.. ప్రయోజనాలు ఏమిటి.. ఇలా అన్నింటిపైనా ఫోకస్ పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ రానుంది. నాణ్యత విషయంలో రాజీ లేకుండా.. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేలా కొత్త పాలసీ తయారీకీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పాలసీ తయారీ కోసం అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తోంది ఏపీ సర్కార్. దేశంలో ఇతర రాష్ట్రాల్లో మద్యం పాలసీలు ఏ విధంగా ఉన్నాయి.. ఆ పాలసీ వల్ల ఎదురయ్యే సమస్యలు ఏమిటి.. ప్రయోజనాలు ఏమిటి.. ఇలా అన్నింటిపైనా ఫోకస్ పెట్టింది. అలాగే మద్యం విషయంలో ఆదాయం ముఖ్యం అనే పద్దతిలో కాకుండా.. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా ఉంది. తాము అధికారంలోకి వస్తే పాత మద్యం బ్రాండ్లను తీసుకొస్తామని చెప్పిన సర్కార్.. పవర్ లోకి వచ్చిన వెంటనే ఆ పని చేసింది. కొత్త మద్యం పాలసీ అధ్యయనం కోసం ప్రభుత్వం ఇప్పటికే నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో టీమ్ లో ముగ్గురు ఎక్సైజ్ అధికారులు సభ్యులుగా ఉంటారు. వీళ్లు.. తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్.. మొత్తం 6 రాష్ట్రాలలో మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నారు. అక్కడి మద్యం పాలసీతో పాటు బ్రాండ్ల ధరలు ఎలా ఉన్నాయి.. షాపుల మెయింటెనెన్స్ ఎలా ఉంది.. కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయి, మద్యం నాణ్యతతోపాటు చెల్లింపుల కోసం ఏ విధానాన్ని అనుసరిస్తున్నారు.. డిజిటల్ చెల్లింపులు ఎలా ఉన్నాయి.. ఇంకా వీటితోపాటు ఎక్సైజ్ పాలసీని కూడా సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. వీటితోపాటు డీఅడిక్షన్ సెంటర్ల నిర్వహణ ఎలా ఉంది..

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: చై- శోభిత ఎంగేజ్‌మెంట్..సామ్ ఇన్ డైరెక్ట్‌ రియాక్షన్

Follow us on