వణికిస్తున్న చలిలోవాతావరణ శాఖ వర్షసూచన..
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. మరో రెండు రోజులు చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగింది. సాయంత్రం నుంచి ఉదయం 8 గంటల వరకు వీస్తున్న చలిగాలులతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో గత రాత్రి అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 9.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అన్నారు. మరోవైపు బంగాళాఖాతం మీద వరుసగా ఏర్పడుతున్న అల్పపీడన వ్యవస్థలు తెలుగు రాష్ట్రాలను మరోసారి ప్రభావితం చేస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాన్ని వాతావరణ శాఖ తెలిపింది. ఎక్కువగా ఏపీ పై ప్రభావం ఉండనుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించిందని అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ పశ్చిమ వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతుండటంతో వర్షాలు మరింత విస్తరించనున్నాయని అంచనా వేశారు. రాగల రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీతా అంబానీ వాడే టీ కప్పుల ఖరీదెంతో తెలుసా ??
నదిలో శివలింగం, నంది దర్శనం.. శివయ్యే వచ్చాడంటూ
వంటచేసేందుకు కిచెన్‌లోకి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్ చూసి షాక్
