Rain Alert: కొనసాగుతున్న ద్రోణి.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్షసూచన చేసింది . బంగాళాఖాతం నుంచి కేరళ వరకు, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఏపీలోని 9 జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్షసూచన చేసింది . బంగాళాఖాతం నుంచి కేరళ వరకు, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఏపీలోని 9 జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వానలు పడతాయని వెల్లడించారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటు తెలంగాణకూ వర్షసూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీమ్, సిద్దిపేట, యాదాద్రి, మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వేల్, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో సాయంత్రం అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే చాన్స్ ఉందని వాతావరణశాఖ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: అయ్యో.. బంగారం మళ్లీ పెరిగిందే
AA22: ఏఏ 22 అప్‌డేట్.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??
Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్
