ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ వీడియో

Updated on: Sep 17, 2025 | 6:09 PM

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ అయ్యాయి. బకాయిలు చెల్లించకపోవడంతో OPD సేవలు నిలిపివేస్తున్నట్టు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. 2 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకి లేఖ రాశారు ఏపీ హాస్పిటల్స్ స్పెషాలిటీ అసోసియేషన్ ప్రతినిధులు. ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, అందుకే ఓపీడీ సేవలు మాత్రమే నిలిపివేశామని, ఎమర్జెన్సీ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పెండిగ్‌ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ కొన్ని రోజులుగా డిమాండ్లు చేస్తున్నా.. ఎన్నిసార్లు లేఖలు రాసినా.. ప్రభుత్వం నుంచి స్పందిచడం లేదని హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది.

బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆస్పత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందని తెలిపింది. బకాయిలు చెల్లించకపోతే.. NTR వైద్య సేవ కింద ఓపీడీ సేవలు నిర్వహించలేమని ఆరోగ్యశ్రీ సీఈవో కి లేఖరాసినట్టు నెట్ వర్క్ హాస్పటల్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ Dr. అవినాష్ వెల్లడించారు. పరిస్థితిని వెంటనే సీఎం దృష్టికి తీసుకు వెళ్లాలని ఆయన డిమాండ్‌ చేశారు. బకాయిలు విడుదల చేయకుండా చర్చలకు తాము సిద్ధంగా లేమని.. బకాయిలు విడుదల చేసిన తర్వాతే చర్చలకు పిలవాలని నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. యూనివర్సల్ హెల్త్ కేర్ అనే సిస్టమ్ ప్రోగ్రామ్ వెళ్లే ముందు తమకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సబ్సిడీ మోడల్‌లో చేయాలనుకుంటే అది సాధ్యం కాదని, ఇన్సూరెన్స్‌ ప్యాకేజ్‌ ఎంతో తమకు తెలియచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ స్కీముకు సంబంధించి ఎంతమొత్తం విడుదల చేస్తారో చెప్పాలని, అంతేకాకుండా స్టేక్‌ హోల్డర్స్‌గా తమను చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్నివీడియోల కోసం :

భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో

ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో

నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో

జ‌పాన్‌లో ల‌క్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో