పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

Updated on: Mar 15, 2026 | 9:01 PM

కృష్ణా జిల్లా కేసరపల్లిలో ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రణయ్, తన తమ్ముడిని ట్యూషన్‌కు తీసుకెళ్తుండగా, పోలీసులు బైక్‌ను ఆపడానికి ప్రయత్నించారు. ఓ కానిస్టేబుల్ హ్యాండిల్ లాగడంతో ప్రమాదం జరిగి, ప్రణయ్ బొలేరో వాన్‌ను ఢీకొని మృతి చెందాడు. పోలీసుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు న్యాయం డిమాండ్ చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం, కేసరపల్లిలో జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో పలగాని ప్రణయ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కేఎల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణయ్, తన తమ్ముడు కౌశిక్‌ను ట్యూషన్ కోసం అవుటపల్లికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు

Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్

దండయాత్రకు రెడీ అవుతున్న కుర్ర హీరోలు.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే

కండలు పెంచుతున్న టాలీవుడ్ స్టార్స్‌.. బాక్సాఫీస్‌కు కొత్త కిక్కిస్తారా

Dhurandhar 2: బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్‌

Follow Us