Weather Update: అల్పపీడనం ముప్పు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఆదివారం వెదర్ రిపోర్ట్..

Updated on: Sep 14, 2025 | 7:56 AM

అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.. దీంతో ఉరుములు మెరుపులతోపాటు.. కుండపోత వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ..

అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.. దీంతో ఉరుములు మెరుపులతోపాటు.. కుండపోత వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. దక్షిణకోస్తా, తిరుపతిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ తెలంగాణలో ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సిరిసిల్ల, కరీంనగర్‌, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి

Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే

Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్‌లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం

Published on: Sep 14, 2025 07:54 AM