Andhra Pradesh: సోమిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి కాకాని.. ఎందుకంటే..

|

Sep 30, 2023 | 12:20 PM

Andhra Pradesh: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ స్కామ్‌పై టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లతో కలిసి..

Andhra Pradesh: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ స్కామ్‌పై టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లతో కలిసి రెండ్రోజుల క్రితం విక్రమసింహపురి యూనివర్సిటీ లోని స్కిల్ సెంటర్ ను సందర్శించారు. స్కిల్ సెంటర్ పనిచేస్తోందంటూ అక్కడ ఉన్న కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లను చూపించారు టిడిపి నేతలు. 34 పాలిటెక్నీకల్, ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు, కీయా మోటార్స్ లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేశామని సోమిరెడ్డి అన్నారు. 2019లో దేశంలోనే స్కిల్ డెవలప్‌మెంట్ పథకం మెదటి స్థానం నిలిచిందని సీఎం జగన్‌ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారని సోమిరెడ్డి చెప్పారు.

అయితే, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎంపీ నిధులతో ఇటీవల నిర్మించిన స్కిల్ సెంటర్ ను తమ ఖాతాలో వేసుకోవడం టీడీపీ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు కాకాని. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై నేతల మధ్య యుద్ధం మరికొంతకాలం కొనసాగే అవకాశముంది.