Montha Effect: ఇంకా ముంపులోనే పంట పొలాలు

Updated on: Nov 01, 2025 | 12:42 PM

మోంటా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగి కుళ్లిపోతున్నాయి. చేతికొచ్చిన పంట పోవడంతో రైతులు తీవ్ర నష్టపోయి ఆవేదన చెందుతున్నారు. 100 శాతం నష్టానికి మాత్రమే పరిహారం అనే నిబంధనపై నిరాశ చెందుతున్న రైతులు, ప్రభుత్వం తక్షణమే ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.

మోంటా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు ఆగిపోయినప్పటికీ, లక్షలాది ఎకరాల్లో పంట పొలాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి, అవి కుళ్లిపోతున్నాయి. కోతకొచ్చిన దశలో తుఫాను దెబ్బతీయడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. అంబెడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు దీవి, కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి మండలం, రాజుపాలెం వంటి ప్రాంతాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారతీయులపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా

మతమార్పిడిని ప్రోత్సహిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ కామెంట్స్

Allu Arha: బ్లాక్ ఔట్‌ఫిట్‌లో అల్లు అర్హ లుక్‌ వైరల్‌

క్షణ క్షణం.. ఉత్కంఠ !! నెక్ట్స్‌ లెవల్ హర్రర్ ఫిల్మ్ !!

సమంతతో యాక్ట్ చేయను కారణం ఏంటంటే’ షాకిచ్చిన ప్రభాస్‌