బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు

Updated on: Jul 14, 2025 | 6:20 PM

నల్ల ఉప్పు గురించి చాలా కొద్దిమందికే తెలిసిఉంటుంది. కానీ ఏన్నో ఏళ్లుగా దీన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారట. దీన్నే హిమాలయ ఉప్పు అని కూడా పిలుస్తారు. చాలా మందికి తెలియని మరో విషయం ఏంటంటే.. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలోని వంటల్లో నల్ల ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని మరింత పెంచుతుంది. ఈ బ్లాక్‌ సాల్ట్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

నల్ల ఉప్పులో జీర్ణక్రియను మెరుగు పరిచే గుణాలు మెండుగా ఉంటాయి. వీటి వల్ల కాలేయంలో బైల్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. జీర్ణకోశంలో యాసిడ్ల స్థాయిలు నియంత్రణలో ఉంటుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బర వంటి సమస్యలు తగ్గుతాయి. బ్లాక్ సాల్ట్‌లో ఉండే ఖనిజాలు మెటబాలిజంను వేగవంతం చేస్తాయి. దీనిని మితంగా సేవించడం వల్ల శరీరం పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. ఆరోగ్యంగా పుష్టిగా తయారు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పు వాడటం చాలా మంచిది. ఇందులో ఉండే కొన్ని ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు మెటబాలిజంను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడతాయి. శరీరంలో త్వరగా కలిసిపోయి ఆహార శోషణను పెంచుతుంది. బ్లాక్ సాల్ట్‌లో ఉండే గంధకం వల్ల చర్మం పరిశుభ్రంగా, తాజాగా ఉంటుంది. ప్రతి రోజూ సాన్నం చేసే నీటిలో చిటికెడు నల్ల ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల మచ్చలు తొలగిపోతయాయి. ఎగ్జిమా, తామర వంటి చర్మ సంబంధిత సమస్యలకు నయం చేయడానికి కూడా నల్ల ఉప్పు చాలా బాగా సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జలుబు, దగ్గు వంటి ఫ్లూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు నల్ల ఉప్పుు వేడి చేసి ఆవిరి పీల్చడం, కాపడం పెట్టుకోవడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యతో బాధపడుతున్నవారు నల్ల ఉప్పు నీటిని రోజుకు రెండు సార్లు పుక్కిలించడం వల్ల సమస్య త్వరగా నయం అవుతుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసన, దంత సమస్యలు కూడా తగ్గుతాయి. నల్ల ఉప్పును మితంగా తినడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. ఫలితంగా గుండెల్లో నొప్పి, మంట వంటి సమస్యలు దూరమవుతాయి. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. ఊబకాయం, గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. మహిళలు పీరియడ్స్ సమయంలో నల్ల ఉప్పుతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల నొప్పులు తగ్గుతాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే జీర్ణసమస్యలు, తలనొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. అయితే ఈ బ్లాక్‌ సాల్ట్‌, పింక్‌ సాల్ట్‌ లాంటి వాటిలో అయోడిన్‌ తక్కువ ఉంటుంది. కనుక ఈ సాల్ట్‌ను అతిగా వాడితే మీ శరీరంలో అయోడిన్‌ లోపం వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ సాల్ట్‌ను వాడాలనుకుంటే మీ వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం

పేలిన రిఫ్రిజిరేటర్‌.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!

170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు