Kachiguda: పెట్రోల్ బంకు‌కొచ్చిన వ్యక్తికి ఫోన్‌పేలో 20 వేలు ట్రాన్స్‌ఫర్ చేయగా.. సీన్ సితారయ్యింది!

| Edited By: Ravi Kiran

Apr 09, 2024 | 8:06 PM

గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమకు ఫోన్ పే, గూగుల్ పేలో డబ్బులు పంపండి.. మేము క్యాష్ ఇస్తామని చెప్తే.. కచ్చితంగా వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు కాచిగూడ డివిజన్ ఏసీపీ. ఇటీవల ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తార్నాకలోని హెచ్‌పి పెట్రోల్ బంక్‌లో..

గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమకు ఫోన్ పే, గూగుల్ పేలో డబ్బులు పంపండి.. మేము క్యాష్ ఇస్తామని చెప్తే.. కచ్చితంగా వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు కాచిగూడ డివిజన్ ఏసీపీ. ఇటీవల ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తార్నాకలోని హెచ్‌పి పెట్రోల్ బంక్‌లో ఏప్రిల్ 5వ తేదీ సుమారు రాత్రి 10 గంటల సమయంలో బంకులో పనిచేసే సర్వీస్ బాయ్ వద్దకు ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తనకు 20 వేలు అవసరం ఉన్నాయని.. ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తే తాను క్యాష్ ఇస్తానని.. అనడంతో అతడు 20 వేలు క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేశాడు. క్యాష్ అందిన వెంటనే.. అక్కడ నుంచి పరారయ్యాడు ఆ గుర్తుతెలియని వ్యక్తి. దీంతో సర్వీస్ బాయ్ అతన్ని వెంబడించాడు. ఆ వెంబడించే క్రమంలో సర్వీస్ బాయ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అయినా దొంగ దొరకకుండా పారిపోయాడు. దీంతో స్థానిక ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతడు ట్రాన్స్‌ఫర్ చేసిన ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేయగా.. ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బులు డ్రా చేసుకోవడానికి హబ్సిగూడలోని ఒక ఏటీఎం వద్దకు రావడంతో ఆ గుర్తుతెలియని వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. సదరు నిందితుడు ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తూ షాపూర్ నగర్‌లో నివాసం ఉంటున్న సాబిల్‌గా గుర్తించారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల పట్ల బంకు యాజమాన్యాలు, వ్యాపారస్తులు ఎవరైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Follow us on