వావ్‌! 27 ఏళ్ల తర్వాత.. ఆ అమ్మాయి.. ఈ అబ్బాయి!

|

Jun 26, 2024 | 3:05 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను జూన్ 24 టాలీవుడ్ నిర్మాతలందరూ కలిశారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. పవన్ కల్యాణ్ ను కలిసిన వారిలో అశ్వనీదత్, ఎ.ఎం.రత్నం, సురేష్ బాబు, ఎస్.రాధాకృష్ణ , దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ, వై.రవిశంకర్ ఉన్నారు. పవన్, టాలీవుడ్ నిర్మాతల భేటీకి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను జూన్ 24 టాలీవుడ్ నిర్మాతలందరూ కలిశారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. పవన్ కల్యాణ్ ను కలిసిన వారిలో అశ్వనీదత్, ఎ.ఎం.రత్నం, సురేష్ బాబు, ఎస్.రాధాకృష్ణ , దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ, వై.రవిశంకర్ ఉన్నారు. పవన్, టాలీవుడ్ నిర్మాతల భేటీకి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఒక ఫొటో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే పవన్ కల్యాణ్- నిర్మాత యార్లగడ్డ సుప్రియ కలిసి దిగిన ఫొటో. ఇక పవన్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతల్లో సుప్రియ కూడా ఒకరు. ప్రస్తుతం ప్రొడ్యూసర్‌ గా రాణిస్తున్న ఈమె.. దాదాపు 27 ఏళ్ల క్రితం పవన్‌తో కలిసి హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. వీరిద్దరూ కలిసి ఈవీవీ డైరెక్షన్లో… ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ సినిమాలో నటించారు. ఆ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ పవర్ స్టార్ గా మారిపోయారు. అయితే సుప్రియ మాత్రం సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా.. సీరియళ్లు చేస్తున్నారు. ఇక దాదాపు 27 ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో కొలువుదీరిన పవన్‌న కలిశారు సుప్రియ. ప్రొడ్యూసర్స్ కౌనిల్స్ తరుపున పవన్‌ను మీట్ అయ్యేందుకు వచ్చారు. అలా పవన్‌తో ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఆ ఫోటోలనే ఇప్పుడు నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు పవన్‌ ఫ్యాన్స్. 27 ఏళ్ల ముందు వీరు చేసిన సినిమాలోని స్టిల్‌ను.. ఇప్పుడు వీళ్లు తీసుకున్న ఫోటోకు జత చేసి వైరల్ చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: ‘నా గుండె కోస్తే మా బాబాయ్‌ బాలకృష్ణ కనిపిస్తారు’

టాలీవుడ్ నటికి బెదిరింపు కాల్స్.. అసలు ఏమైందంటే ??

TOP 9 ET News: కల్కి ఊచకోత… ఇవేం రికార్డులురా బాబు.. | కోరిన కోర్కెలు నిజమైన వేళపవన్‌ కఠోర దీక్ష

Published on: Jun 26, 2024 02:59 PM