Ludo Game: ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన.. ఇంటి ఓనర్‌తో మహిళ లూడో గేమ్ ఓడిపోవడంతో..
మహాభారతంలో పాండవులు జూదంలో ద్రౌపదిని పణంగా పెట్టిన కథ అందరికీ తెలిసిందే. అయితే ఓ మహిళ తనను తానే జూదంలో ఓడి భర్తను వదిలి సదరు వ్యక్తికి వశమైంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది. నగరంలోని కొత్వాలి ప్రాంతంలో నివసించే ఓ మహిళ తన భర్త లేని సమయంలో తన ఇంటి యజమానితో కలిసి లూడో ఆడేది. భర్త పంపించిన డబ్బులు అయిపోవడంతో ఆమె తనను తాను పణంగా పెట్టి గేమ్ ఆడింది. ఓడిపోయింది. ఫలితంగా ఆ మహిళను ఇంటి ఓనర్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత విషయం వేరే చోట పనిచేస్తున్న భర్తకు చెప్పింది. అతడు లబోదిబోమంటూ తన భార్యను తనకు ఇప్పించమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.బాధితురాలి భర్త దేవ్‌కలి జీవనోపాధి నిమిత్తం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంటున్నాడు. అక్కడ ఇటుకల బట్టీలో పనిచేస్తూ భార్యకు డబ్బులు పంపించేవాడు. ఆ డబ్బులతో భార్య ఇలా జూదం ఆడుతూ వృధా చేసేది. ఈ క్రమంలో ఉన్న డబ్బు అయిపోవడంతో ఆమో తనను తాను పణంగా పెట్టింది. చివరకు ఓడిపోయింది. తాను ఆటలో ఓడిపోయి ఇంటి యజమానికి సొంతం అయ్యానని.. భర్త ఇంటికి వస్తే తనను చంపేస్తాడని చెప్పింది. అంతేకాదు భర్తను నేరుగా ఇంటికి రాకుండా పోలీసులను కలవాలని కోరింది. దీంతో షాక్‌కు గురైన భర్త వెంటనే సొంత గ్రామానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య నిత్యం జూదం, ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపాడు. ఇంటి యజమానికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వెల్లడించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..