ఉదయాన్నే మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. తిరిగి చూడగా గుండె గుభేల్
విశాఖపట్నం శ్రీహరిపురంలోని ఓ ఇంటి పరిసరాల్లో భారీ కొండచిలువ కలకలం రేపింది. మొక్కలకు నీళ్లు పోసేందుకు బయటకు వచ్చిన కుటుంబ సభ్యుడికి వలలో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా సుమారు 8 అడుగుల కొండచిలువ వలలో చిక్కుకుని కనిపించింది. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించడంతో ఆయన బృందంతో చేరుకుని వలను జాగ్రత్తగా కత్తిరించి కొండచిలువను సురక్షితంగా బయటకు తీశారు.
విశాఖపట్నం శ్రీహరిపురంలో ఉదయాన్నే ఒక కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. సాధారణంగా రోజువారీ పనుల్లో మునిగిపోయే ఆ ఇంటి సభ్యులకు, ఆ రోజు ఉదయం ఎదురైన అనుభవం గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. శ్రీహరిపురంలోని కొండవాలు ప్రాంతంలో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటి పరిసరాల్లోకి కోళ్లు, మేకలు, ఇతర జంతువులు రాకుండా ఉండేందుకు ఆ కుటుంబం ఫెన్సింగ్ చుట్టూ రక్షణగా వలను ఏర్పాటు చేసుకుంది. రోజులాగే ఉదయాన్నే మొక్కలకు నీళ్లు పోసేందుకు ఇంటి సభ్యుల్లో ఒకరు బయటకు వచ్చారు. ఆ సమయంలో మొక్కల పొదల వద్ద వలలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. మొదట కోళ్లో లేదా పక్షులో చిక్కుకున్నాయని భావించారు. కానీ, అంతలోనే అక్కడ నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. అనుమానంతో కాస్త దగ్గరకు వెళ్లి తదేకంగా చూసిన అతనికి ఒక్కసారిగా కాళ్లు చేతులు ఆడలేదు. వలలో చిక్కుకుని విలవిలలాడుతున్నది ఏదో పక్షి కాదు.. ఏకంగా 8 అడుగుల పొడవైన భారీ కొండచిలువ! వల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ అది భయంకరమైన శబ్దాలు చేస్తోంది. దాంతో భయంతో వణికిపోయిన ఆ కుటుంబం వెంటనే ‘స్నేక్ క్యాచర్’ నాగరాజుకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న నాగరాజు తన బృందంతో కలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. వలలో చిక్కుకు పోయిన కొండచిలువకు ఎలాంటి గాయం కాకుండా, చాకచక్యంగా వలను కత్తిరించి దాన్ని సురక్షితంగా రెస్క్యూ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలంలో పాములు, కొండచిలువల సంచారం ఎక్కువగా ఉంటుందని.. ముఖ్యంగా పొదలు, చెట్ల పొదుల్లో ఆశ్రయం పొందుతాయని స్నేక్ క్యాచర్ నాగరాజు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైల్వే స్టేషనే పోలీస్ స్టేషన్.. ఏపీలో కొత్త సేవలు!
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..? థియేటర్‌కు దిమ్మతిరిగే షాక్..
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

