Andhra: ఇటుకల బట్టి వద్ద లారీ ఆపేసి డ్రైవర్ పరార్.. అనుమానమొచ్చి లోపల చెక్ చేయగా..

Updated on: May 31, 2025 | 6:31 PM

నిత్యం ఇటుకుల బట్టిలో కూలీ పనికొచ్చే కూలీలు.. ఆ రోజు కూడా పనికి వచ్చారు. వాళ్లు పనికి వచ్చినప్పుడు వారి కంట ఓ లారీ పడింది. ఇదేంటి నాలుగు రోజులుగా ఇక్కడే ఉందని అనుకున్నారు. అనుమానమొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లోపల చెక్ చేయగా..

తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లిలో భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పుష్ప సినిమా తరహాలో గంజాయిను లారీ క్యాబిన్ బాక్స్ కింద రహస్య గదిని రవాణా చేస్తున్నారు స్మగ్లర్లు. మే 24న దేవరపల్లిలో బైక్‌పై ఉన్న భార్యభర్తలను ఢీకొట్టిన లారీ కూడా ఇదేనని పోలీసులు గుర్తించారు. బైక్‌పై ఉన్నవారు చనిపోయారని గమనించడంతో స్మగ్లర్.. కొంతదూరం వెళ్లి లారీని వదిలేసి పారిపోయాడు. తర్వాత స్థానికులు లారీ నాలుగు రోజుల నుంచి జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్‌లో ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లారీ వద్దకు చేరుకున్న పోలీసులు.. క్యాబిన్ కింద రహస్య గదిలో గంజాయి ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. అనంతరం నిందితుడైన లారీ డ్రైవర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో 730 కేజీల గంజాయి, లారీ, సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..