Special Trains To Ayodhya: 430 నగరాల నుంచి అయోధ్యకు నేరుగా ప్రత్యేక 72 రైళ్లు.! పూర్తి వివరాలు.

|

Jan 05, 2024 | 6:53 PM

అయోధ్యరాముడు భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతున్నాడు. జనవరి 22 న ప్రధాని మోదీ చేతులమీదుగా శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అనంతరం అయోధ్యలో రాముని దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. అన్ని విధాలుగా రవాణావ్యవస్థను మెరుగుపరుస్తోంది. ఈ క్రమంలో అయోధ్యకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేనుంది.

అయోధ్యరాముడు భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతున్నాడు. జనవరి 22 న ప్రధాని మోదీ చేతులమీదుగా శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అనంతరం అయోధ్యలో రాముని దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. అన్ని విధాలుగా రవాణావ్యవస్థను మెరుగుపరుస్తోంది. ఈ క్రమంలో అయోధ్యకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేనుంది. అయోధ్య సందర్శనకు వచ్చే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఏసీ మొదలుకొని స్లీపర్ క్లాస్‌, జనరల్ సౌకర్యాలతో కూడిన అన్ని రకాల రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతోంది. అయోధ్య వైపు వెళ్లే రైళ్ల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నదని సమాచారం. ప్రస్తుతం అయోధ్యకు 35 రైళ్లు నడుస్తున్నాయి. రోజువారీ రైళ్లతో పాటు, వీక్లీ రైళ్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు జనవరి 22 నుంచి 37 అదనపు రైళ్లను నడపనున్నారు. దీంతో దేశంలోని 430 నగరాల నుంచి మొత్తం 72 రైళ్లు అయోధ్యకు నడవనున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు అదనపు రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ సమాచార, ప్రచురణ డైరెక్టర్ శివాజీ మారుతీ సుతార్ తెలిపారు. మరిన్ని నగరాలను నేరుగా అయోధ్యకు అనుసంధానం చేసేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోందని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Jan 05, 2024 06:52 PM