ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉండండి: వెంకయ్య నాయుడు

శంషాబాద్, ముచ్చింతల్లో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌- కేర్‌ హాస్పిటల్స్‌ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిర కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. శారీరక శ్రమ మన జీవన శైలికి అత్యంత అవసరమని సూచించారు. ప్రస్తుతమున్న కాలంలో టీవీలకు, సెల్‌ఫోన్‌లకు అంటుకుపోయి జీవిస్తున్నారని అన్నారు. వ్యాయామం, వాకింగ్‌లు శరీరానికి చాలా మంచిదని.. […]

ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉండండి: వెంకయ్య నాయుడు
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2019 | 12:26 PM

శంషాబాద్, ముచ్చింతల్లో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌- కేర్‌ హాస్పిటల్స్‌ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిర కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. శారీరక శ్రమ మన జీవన శైలికి అత్యంత అవసరమని సూచించారు. ప్రస్తుతమున్న కాలంలో టీవీలకు, సెల్‌ఫోన్‌లకు అంటుకుపోయి జీవిస్తున్నారని అన్నారు. వ్యాయామం, వాకింగ్‌లు శరీరానికి చాలా మంచిదని.. దీంతో చాలా శక్తివంతంగా తయారవుతారని అన్నారు. అంతేగాక ఈ వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాలని తెలిపారు వెంకయ్య.