Breaking News
  • ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌. దిశ చట్టంపై జగన్‌ను అభినందించిన అనిల్‌ దేశ్‌ముఖ్‌. మహారాష్ట్రలో దిశ చట్టం అమలుకు పరిశీలిస్తామన్న దేశ్‌ముఖ్‌.
  • చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడ్డ బంగారం. 12.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.44 కోట్లు ఉంటుందని అంచనా. మలేషియా, సింగపూర్‌ నుంచి బంగారం తరలిస్తున్నట్టు గుర్తింపు. 18 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.
  • స్థానిక ఎన్నికల్లో పోటీపై పురంధేశ్వరి నేతృత్వంలో కమిటీ వేశాం. రాజధాని అమరావతిలోనే ఉండేలా కార్యాచరణ ప్రకటిస్తాం-కన్నా. ఎంపీల గైర్హాజరును పెద్దది చేయాల్సిన అవసరం లేదు. వారివారి వ్యక్తిగత కారణాలతో రాలేమని ముందే చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు గురించి నాకు సమాచారం లేదు. ఈనెల 25లోగా టీఎస్‌ కొత్త అధ్యక్షుడిపై స్పష్టత వస్తుంది. -ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
  • ఢిల్లీ: షాహిన్‌బాగ్‌లో ఆందోళనకారులతో మధ్యవర్తుల చర్చలు. ఎటూ తేలకుండానే రెండో రోజు ముగిసిన చర్చలు. ఆందోళనలు విరమించాలని షాహిన్‌బాగ్‌ వాసులను కోరిన మధ్యవర్తులు. సీఏఏను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్న ఆందోళనకారులు. నిరసనలు చేసుకోవచ్చు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న మధ్యవర్తులు. లేదంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందన్న మధ్యవర్తులు.
  • ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో నేను లేను.. అది కేంద్ర నిర్ణయం. మాకు ఎవరితోనూ పొత్తు లేదు.. జనసేనతో మాత్రమే మా పొత్తు -మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి.
  • విజయవాడ: వివేకానందరెడ్డి హత్యకేసుపై హైకోర్టులో విచారణ. విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.

‘వెల్లువచ్చి గోదారమ్మ’.. మళ్లీ ఇలా వచ్చిందమ్మా..

Velluvachi Godaramma remake song from Varun Tej Valmiki released, ‘వెల్లువచ్చి గోదారమ్మ’.. మళ్లీ ఇలా వచ్చిందమ్మా..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో హరీశ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన జిగర్తాండ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ నెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. కాగా ఈ మూవీ కోసం మరో క్లాసిక్ పాటను రీమేక్ చేయించాడు దర్శకుడు హరీష్ శంకర్. శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించిన దేవత చిత్రంలోని వెల్లువచ్చి గోదారమ్మ పాట ఇప్పుడు వాల్మీకిలోనూ ఉండబోతుంది. వరుణ్ తేజ్, పూజా హెగ్డే మధ్య ఈ సాంగ్‌ను తెరకెక్కించగా.. దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఒరిజనల్ పాటకు ఏ మాత్రం తీసిపోకుండా.. ఈ పాట ఉండబోతున్నట్లు అందులో స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ పాటలో పూజా హెగ్డే కూడా తన అందాలతో అదరగొడుతోంది. మొత్తానికి సినిమాకు ఈ రీమేక్ పాట అదనపు ఆకర్షణ అవుతుందని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ నటుడు అథర్వ మురళి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన సరసన మృణాళిని రవి కనిపించనుంది. వరుణ్ తేజ్ విలన్‌గా నటించాడు. 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో ఆకట్టుకున్న వాల్మీకిపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది ఎఫ్ 2తో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న వరుణ్.. వాల్మీకితో రెండో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. మరి మొత్తానికి వాల్మీకి ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.

Related Tags