ఒలింపిక్ విజేత ట్రైనింగ్‌లో వరుణ్

ఈ ఏడాది ‘ఎఫ్2’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వరుణ్ తేజ్.. రెండు చిత్రాలకు ఓకే చెప్పాడు. వాటిలో కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్నది ఒకటి. అందులో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అందుకోసం ప్రస్తుతం బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. 2008లో ఒలింపిక్ కాంస్య పతక విజేత టోనీ జాఫ్రెస్ వద్ద వరుణ్ మెళుకువలు నేర్చుకుంటున్నాడు. అందుకు సంబంధించిన ఓ ఫొటో తాజాగా బయటకు వచ్చింది. ఇక ఈ చిత్రంతో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:52 pm, Sat, 9 March 19

ఈ ఏడాది ‘ఎఫ్2’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వరుణ్ తేజ్.. రెండు చిత్రాలకు ఓకే చెప్పాడు. వాటిలో కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్నది ఒకటి. అందులో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అందుకోసం ప్రస్తుతం బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. 2008లో ఒలింపిక్ కాంస్య పతక విజేత టోనీ జాఫ్రెస్ వద్ద వరుణ్ మెళుకువలు నేర్చుకుంటున్నాడు. అందుకు సంబంధించిన ఓ ఫొటో తాజాగా బయటకు వచ్చింది.

ఇక ఈ చిత్రంతో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాడు వరుణ్. కోలీవుడ్‌లో విజయం సాధించిన ‘జిగర్తాండ’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. వరుణ్ విలన్‌గా కనిపించనున్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.