వరుణ్, వితికా షెరూ మధ్య అగ్గిరాజేసిన బిగ్ బాస్

Varun Sandesh Vithika Sheru war started in Bigg Boss 3 telugu season 3: promo goes viral in social media, వరుణ్, వితికా షెరూ మధ్య అగ్గిరాజేసిన బిగ్ బాస్

బిగ్ బాస్ హౌజ్‌లోకి వరుణ్ సందేశ్, వితికా షెరూ జంటను పంపించినపుడే ఏదో అవుతుందని ముందు నుంచి అనుకుంటున్నారు. ఇప్పుడు అనుకున్నంతా అయిపోయింది.. ఈ ఇద్దరి మధ్య విజయవంతంగా చిచ్చు పెట్టేసాడు బిగ్ బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ ఇద్దరూ గొడవ పడుతున్నదే హైలైట్ చేసారు. దోశల విషయంలో ఇంట్లో జరిగిన గొడవలో వితిక సెంటర్ అయిపోయింది. ఈ విషయంలో ముందు పునర్ణవి ఎంటర్ అయింది.. అక్కడ గ్యాస్ విషయంలో మరో వివాదం రాజుకుంది.

తాను సైకిల్ తొక్కడం వల్లే గ్యాస్ వచ్చిందని పునర్ణవి అంటే.. తాను 40 దోశలు వేసానని వితికా చెప్పుకుంది. ఆ వెంటనే ఈ వార్ మొదలైంది. గ్యాస్ నువ్వు కాకపోతే మరొకరు తొక్కేవాళ్లు అని వితికా పునర్ణవిని అనగా.. దోశలు నువ్వు కాకపోతే మరొకరు వేసేవాళ్లు అంటూ భార్యకు పంచ్ ఇచ్చాడు వరుణ్ సందేశ్. ఇక్కడ నువ్ ఎందుకు మధ్యలో వస్తున్నావ్ అంటే వెంటనే తనకు అనిపించిందని చెప్తున్నానంటూ వరుణ్ ఫైర్ అయ్యాడు. ఇక వితిక షెరూ వెంటనే బయటికి పెద్దగా ఏడ్చుకుంటూ వచ్చేసింది. ఈ ప్రోమో ఇప్పుడు సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *