కరోనా పరిస్థితికి చైనాయే కారణం…అమెరికా ఫైర్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పరిస్థితికి చైనాయే కారణమని అమెరికా ఆరోపించింది. ఈ వైరస్ నివారణకు ఇప్పటికైనా చైనా... ప్రపంచ దేశాలతో కలిసి  అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో..

కరోనా పరిస్థితికి చైనాయే కారణం...అమెరికా ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 22, 2020 | 10:15 AM

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పరిస్థితికి చైనాయే కారణమని అమెరికా ఆరోపించింది. ఈ వైరస్ నివారణకు ఇప్పటికైనా చైనా… ప్రపంచ దేశాలతో కలిసి  అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో సమావేశమైన పాంపియో.. బీజింగ్ పాటిస్తున్న విధానాలను ఆయన దృష్టికి తెచ్చారు. హాంకాంగ్ విషయంలో ఆ దేశం అనుసరిస్తున్న వైఖరి, మైనారిటీలైన ఉవిగర్ ముస్లింల పట్ల వేధింపులు, కరోనా వైరస్ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, తన ప్రయోజనాలకోసం దీన్ని వినియోగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఏకరువు పెట్టారు.  చైనా పట్ల తమ దేశాధ్యక్షుడు ట్రంప్ పాటిస్తున్న కఠిన ధోరణిని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ వద్ద కూడా ప్రస్తావించారు. అసలు ఈ పాండమిక్ ను మొదట్లోనే నివారించే అవకాశాలు ఉన్నప్పటికీ  చైనా కావాలనే దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తేకుండా దాచిపెట్టిందని మైక్ పాంపియో ఆరోపించారు చైనాతో బాటు అన్ని దేశాలూ ఓ అంతర్జాతీయ  ప్రమాణ వ్యవస్థకు కట్టుబడి ఉండాలని ఆయన ఆకాంక్షించారు.