మీ రహస్యాలను మాతో పంచుకున్నందుకు థాంక్యూ: ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ మెగా కోడలిగా మెప్పు పొందుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించే ఈమె ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి బిపాజిటివ్ అనే మ్యాగిజైన్‌ను కూడా నడిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి బిపాజిటివ్ విత్ ఉపాసన పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ అప్‌లోడ్ చేస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను ఉపాసన ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో హెల్త్‌, సీక్రెట్స్‌, డైట్ ప్లాన్స్‌, ఫిట్ నెస్‌కి సంబంధించి త‌దిత‌ర విష‌యాల‌ని స‌ల్మాన్‌ని అడిగారు ఉపాస‌న‌. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియజేస్తూ.. ఇదీ భాయ్ అంటే.. మీ రహస్యాలను మాతో పంచుకున్నందుకు థాంక్యూ సల్మాన్ ఖాన్ అంటూ ట్వీట్ చేశారు. సల్మాన్ భాయ్‌లోని కొత్త కోణాన్ని త్వరలో చూపించబోతున్నాం అంటూ త‌న‌ ట్వీట్‌లో తెలిపింది ఉపాస‌న‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *