కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్‌ అరెస్ట్.. రీజన్ ఇదే..

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్‌ తగిలింది. యూపీ మైనార్టీఆ సెల్‌ చైర్మన్ షహన్ వాజ్‌ ఆలంను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది డిసెంబర్‌ 19 నాడు లక్నోలోని సీఎం ఇంటి సమీపంలో జరిగిన హింసాకాండలో..

కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్‌ అరెస్ట్.. రీజన్ ఇదే..
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 4:42 PM

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్‌ తగిలింది. యూపీ మైనార్టీఆ సెల్‌ చైర్మన్ షహన్ వాజ్‌ ఆలంను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది డిసెంబర్‌ 19 నాడు లక్నోలోని సీఎం ఇంటి సమీపంలో జరిగిన హింసాకాండలో ఆయన ఉన్నట్లు వీడియోలో ఆధారాలు లభించాయి. సీఏఏకి వ్యతిరేకంగా ఢిల్లీ,యూపీలోని అనేక ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో లక్నో పోలీసులకు పక్కా ఆధారాలు దొరకడంతో.. యూపీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్‌ ఆలంపై కేసులు నమోదు చేశారు. సోమవారం నాడు ఆయన్ను ఆరెస్ట్ చేశామని లక్నో సెంట్రల్ డీసీపీ తెలిపారు. అయితే ఆలం అరెస్ట్‌పై కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్‌ ముందుకు వచ్చి ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జ్‌ చేశారు. తమ నేతలపై, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ కాంగ్రెస్ అధికారులు ఆరోపిస్తున్నారు.