Breaking News
  • తూర్పుగోదావరి: రైతు సదస్సులో జనసేన కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీకు క్రమశిక్షణ లేదంటూ కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయానన్న పవన్
  • ఢిల్లీ అగ్నిప్రమాదంపై క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు. ఫ్యాక్టరీ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. పరారీలో ఫ్యాక్టరీ యజమాని. వారం రోజుల్లో విచరాణ పూర్తి చేయాలని ఆదేశాలు
  • అమరావతి: ఈ నెల 23 నుంచి కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన. మూడు రోజులపాటు పర్యటించనున్న వైఎస్‌ జగన్‌. జమ్మలమడుగు, పులివెందుల, కడప, మైదుకూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న జగన్‌
  • అనంతపురం: సాకే పవన్‌ చేసిన వ్యాఖ్యలకు జనసేన మద్దతు. సాకే వ్యాఖ్యలను సమర్థించిన అనంతపురం జనసేన నేతలు. రెడ్డి సంఘం నేతలపై జనసేన నేతల ఆగ్రహం
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • మాజీ ఎంపీ కవితకు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం. ఐఎస్‌బీలో ఇండియన్‌ డెమక్రసీ ఎట్‌ వర్క్‌ సదస్సుకు ఆహ్వానం. జనవరి 9, 10 తేదీలలో జరగనున్న సదస్సు. మనీ పవర్‌ ఇన్‌ పాలిటిక్స్‌ అంశంపై ప్రసంగించనున్న కవిత
  • తూ.గో:జనసేన రైతు సదస్సును ముట్టడించిన ఎమ్మార్పీఎస్‌. పవన్‌ రైతు సదస్సులోకి చొచ్చుకొచ్చిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు. అడ్డుకున్న జన సైనికులు, ఇరువురి మధ్య తోపులాట. సమస్యలపై పవన్‌తో మాట్లాడాలంటూ వాగ్వాదం

దసరా కష్టాలు: ఓ వైపు ఆర్టీసీ ఎఫెక్ట్.. మరోవైపు ప్రైవేట్ సర్వీస్ ఛార్జీల బాదుడు..

Unhappy Dussehra Celebraions, దసరా కష్టాలు: ఓ వైపు ఆర్టీసీ ఎఫెక్ట్.. మరోవైపు ప్రైవేట్ సర్వీస్ ఛార్జీల బాదుడు..

పెద్ద పండుగలు వచ్చాయంటే చాలు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిట లాడుతుంటాయి. సొంతూళ్లకు వెళ్లే వారితో ఓ వైపు జనసంద్రం, మరో వైపు ఎక్కడ చూసినా రోడ్ల పై ట్రాఫిక్ నిలిచిపోతుంది. టోల్ గేట్స్ వద్ద సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్లేవారు క్యూ కట్టేస్తారు. ఇప్పుడు దసరా పండుగ రావడంతో ప్రైవేట్ సర్వీసులు, నడుపుతున్న వాహనాల టికెట్ల రేట్లు భారీగా పెంచేశాయి. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం అక్టోబర్ 11 వరకు అదనపు బస్సులను ప్రభుత్వం కేటాయించింది. కాగా దూరప్రాంతాలైన విజయవాడ, గుంటూరు, బెంగుళూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లే వారికి టికెట్ పై 30 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ఓ వైపు టికెట్ ఛార్జీల బాదుడు, మరో వైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రజలకు ఇక్కట్లు తెచ్చిపెట్టాయి. ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. దసరా పండగకు అందరూ ఫ్యామిలీస్‌తో ఊర్లు వెళ్లడం కష్టంగా మారింది. రైళ్లు, బస్సులు అన్ని కూడా ఫుల్ అయ్యాయి.

మరోవైపు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కూడా దసరా పండుకకు ఊర్లు వెళ్లే వారి పై ప్రభావం చూపుతోంది. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వెహికిల్స్ వారు ఇష్టం వచ్చినట్లు డబ్బులు దండుకుంటున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల సర్వీసులు నిలిచిపోవడంతో.. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఇక అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగాలకు వెళ్లవలసిన వారు ప్రైవేట్ వెహికిల్స్‌ను ఆశ్రయించడం తప్పడం లేదు. దొరికిందే అవకాశం అన్నట్లు ఆటో, క్యాబుల డ్రైవర్లు అదనపు ఛార్జీలు తీసుకుంటున్నారు. రూ.30 తీసుకునే దూరానికి రూ.50లు, రూ.50 లు తీసుకునే దూరానికి రూ.100 ఇలా ఇష్టం వచ్చినట్లు తీసుకుంటున్నారు.

ఇక మెట్రో విషయానికి వస్తే.. రోజు ప్రయాణించే వారి కంటే రెండింతల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి మూడు నిమిషాలకొకసారి మెట్రో సర్వీస్ అందిస్తోంది. అంతేకాకుండా టికెట్ పై రోజు కంటే డబుల్ ఛార్జీలు పెంచారు. ఒక్క హైదరాబాద్‌లోనే 29 డిపోలు, 3,557 బస్సులు ఉన్నాయి. వీటిలో కేవలం 150 నుంచి 200 బస్సులు మాత్రమే రోడ్ల పై కనిపిస్తున్నాయి. పలు జిల్లాల్లో ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నారు. ఇక దసరా పండుగకు ఊర్లు వెళ్లాల్సిన వారు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ట్రైన్లు కూడా ఫుల్ అవ్వడంతో కొంతమంది ఇంటిబాట పట్టారు. ప్రభుత్వం ఓ వైపు హెచ్చరిస్తున్నా.. ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వం మాట అటుంచి కంటే.. ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. బస్సులు అందుబాటులో లేకపోతే.. ప్రైవేట్ వెహికిల్స్‌లో ట్రావెల్ చేయడం వల్ల నెలకు వచ్చే జీతం ఛార్జీలకే అయిపోతుందని సామాన్య ప్రజానీకం అభిప్రాయపడుతోంది.