Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 90 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 190535. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 93322. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 91819. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5394. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని నివాసంలో సుదీర్గంగా సాగిన కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం. మోడీ పాలన రెండవ విడత లో ఏడాది పూర్తయిన తరువాత తొలిసారి జరిగిన కేబినెట్ భేటీ. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. మద్యాహ్నం 3 గంటలకు కేబినెట్ నిర్ణయాలు ప్రకటించనున్న కేంద్రమంత్రులు. దేశ ఆర్థిక వ్యవస్థ, కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్,చైనా భారత్ సరిహద్దు వివాదం అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
  • జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసి) వెంట భారత బలగాలు జరిపిన కాల్పుల్లో 3 మంది ఉగ్రవాదులు మృతి.
  • విశాఖ నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కన్యాకుమారి, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతాల్లోకి రుతుపవనాల ఆగమనం అరేబియా సముద్రంలోని ఆగ్నేయ, తూర్పు మధ్య ప్రాంతాల్లో బలపడుతున్న అల్పపీడనం, ఇది ఈనెల మూడు నాటికి తుపానుగా మారి మహారాష్ట్ర, గుజరాత్ ల మీదికి ప్రయాణిస్తుందని అంచనా తెలంగాణ ,కోస్తాంధ్రలలో నేడు కూడా కొనసాగనున్న గాలివానలు.
  • చెన్నై : కోలీవుడ్ లో ముదురుతున్న గాడ్ మాన్ వెబ్ సిరీస్ వివాదం. గాడ్ మాన్ వెబ్ సిరీస్ ట్రైలర్,టీజర్ ని విడుదల చేసిన నిర్మాణ సంస్థ . ట్రైలర్ లో బ్రహ్మనులను కించపరుస్తూ సంభషణలు ,సన్నివేశాలుండడం ఫై బీజేపీ నేతలు,హిందూ సంఘాలు ఆగ్రహం . నిర్మాణ సంస్థ ,దర్శకుడి ఫై పోలీసులకు ఫిర్యాదు ,6 సెక్షన్ లలో కేసు నమోదు చేసిన పోలీసులు . ట్రైలర్ ,టీజర్ లను యూట్యూబ్ నుండి తొలగించిన నిర్మాణ సంస్థ.
  • ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్. 2 వారాల క్రితం ముంబై నుండి డిల్లీకి వచ్చిన ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ సైంటిస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సైoటిస్ట్. ICMR HQ లలో సమావేశం కోసం ఢిల్లీ కి వచ్చినట్లు అధికారులు వెల్లడి. భవనాన్ని శాని టైజేషన్ చేస్తున్న అధికారులు.

క్రికెట్‌లో కొత్త రూల్స్ వ‌చ్చాయ్.. తెలుసుకున్నారా..?

Coronavirus: ICC releases official guidelines for resumption of cricket matches, క్రికెట్‌లో కొత్త రూల్స్ వ‌చ్చాయ్.. తెలుసుకున్నారా..?

కరోనా వైరస్ యావ‌త్ ప్ర‌పంచాన్నే ఇంట్లో కూర్చోబెట్టేసింది. ప్ర‌జ‌ల జీవన విధానాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. క‌రోనా కారణంగా తాజాగా క్రికెట్ నిబంధనల్ని కూడా ఐసీసీ కఠినతరం చేసింది. వైర‌స్ కార‌ణంగా అనేక టోర్నీలు ర‌ద్దుకాగా, మ‌రికొన్ని వాయిదా ప‌డ్డాయి. తాజా ప‌రిస్థితుల‌ను చూస్తుంటే జూన్ నుంచి మళ్లీ క్రికెట్ సిరీస్‌లు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రౌండ్ లో ప్లేయ‌ర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అంపైర్లు నడుచుకోవాల్సిన తీరు, మ్యాచ్ అధికారుల నియమావళిపై  ఐసీసీ ప్రత్యేకంగా కొన్ని రూల్స్‌ని తెర‌పైకి తెచ్చింది. ఈ క్రమంలో ఆట‌గాళ్లు, అంపైర్ల మధ్య ఉన్న చైన్ సైకిల్ రిలేషన్‌ని పూర్తిగా తప్పించింది.

మాములుగా ఓవర్ ముగిసిన తర్వాత… ఫీల్డింగ్ టీమ్ బంతిని ఫీల్డ్ అంపైర్‌కి ఇస్తుంది. వన్డే మ్యాచుల్లో అయితే.. రెండు బంతుల్ని ఉప‌యోగిస్తుంటారు. దాంతో.. ప్రతి ఓవర్ వేసే ముందు స్ట్రైకింగ్ అంపైర్ చేతి నుంచి బౌలర్ బంతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై కూడా అదే రూల్ కొన‌సాగుతుంది. అయితే అంపైర్ మాత్రం బంతిని అందుకునేముందు తన చేతులకి గ్లౌవ్స్‌ని ధరించాలి. ఇదే ప‌ద్దతిలో ఓవ‌ర్ వేయ‌బోయే ముందు బౌల‌ర్.. అంపైర్‌కి తన క్యాప్, క‌ళ్ల‌ద్దాలు ఇవ్వడాన్ని కూడా ఐసీసీ నిషేధించింది. గ్రౌండ్ లో ప్లేయ‌ర్స్ మాత్ర‌మే కాకుండా..వారితో అంపైర్లు కూడా కనీసం 1.5 మీటర్ల డిస్టెన్స్ పాటించాల‌ని సూచించింది. ఏదైనా ఒక‌ క్రికెట్ జట్టు సిరీస్‌కి ఆడ‌టానికి ముందు 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటే.. అది కరోనా ఫ్రీ టీమ్ గా మారుతుంది. కాబట్టి.. ఆ టీమ్‌లోని ఆటగాళ్ల మధ్య కోవిడ్-19 వ్యాప్తించే ప్రమాదం తగ్గుతుంది. ఇక జ‌ట్టులోని క్రికెటర్లకి బయటి నుంచి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్న వ్యక్తులు అంపైర్లు మాత్రమే. అటువంటి ప్ర‌మాదాలు జ‌రగ‌కుండా ఐసీసీ ఈ ఆదేశాలు జారీ చేసింది.

Related Tags