Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

ఫిబ్రవరిలో అగ్రరాజ్యాధినేత భారత్ రాక!

trump to visit india, ఫిబ్రవరిలో అగ్రరాజ్యాధినేత భారత్ రాక!

ఫిబ్రవరి నెలలో యావత్ ప్రపంచం భారత్ వైపు చూసే సందర్భం రానుందా? ఓ ఆంగ్ల ప్రతిక కథనం నిజమైతే డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి మూడో వారంలో ఇండియా పర్యటనకు రానున్నారు. గత సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని డొనాల్డ్ ట్రంప్‌ని స్వయంగా ప్రధాని మోదీ ఆహ్వానించినా.. ఆయన షెడ్యూల్ బిజీగా వుండడంతో మోదీ అభ్యర్థనను ట్రంప్ తిరస్కరించారు. రెండు, మూడు నెలల క్రితం ట్రంప్‌ని కలిసిన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జై శంకర్… మరోసారి ట్రంప్‌ను భారత పర్యటనకు ఆహ్వానించారు.

కేంద్ర మంత్రుల అభ్యర్థనకు ట్రంప్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అయితే, రిపబ్లిక్ డే వేడుకలకు ఆయన రావడం లేదని, ఫిబ్రవరి మూడో వారంలో ట్రంప్ ఇండియాకు రావచ్చని జాతీయ మీడియా పేర్కొంది. అయితే, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి వచ్చే వారం సెనెట్‌లో ఓటింగ్ జరిగే పరిస్థితి వుంది. సెనెట్‌లో బలమున్న ట్రంప్‌కు అభిశంసన భయం లేకపోయినప్పటికీ ఆ తంతు ముగిసిన తర్వాత గానీ.. భారత్ పర్యటనకు తేదీలను ఖరారు చేయలేరు.

సో.. ట్రంప్ భారత్ పర్యటన తేదీలు జనవరి నాలుగో వారం కల్లా ఖరారవుతాయని తెలుస్తోంది. గత నవంబర్‌లోనే తాను ఏదో ఒక సందర్భంలో భారత్‌కు వెళతానని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఆయన ప్రకటనకు అనుగుణంగానే ప్రస్తుతం వైట్ హౌజ్ వర్గాలు తేదీల ఖరారుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా దేశాల్లో మరీ ముఖ్యంగా ఇరాన్, ఇరాక్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పాత్ర అత్యంత కీలకమైన నేపథ్యంలో ట్రంప్ భారత్ పర్యటనపై ఆసక్తిగా వున్నారని ప్రచారం జరుగుతోంది.