Viral: మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు.. సీన్ కట్ చేస్తే.!

|

Mar 29, 2024 | 5:55 PM

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్.. ‘ఎవరు చేసిన కర్మఫలం.. వారు ఎప్పటికైనా ఫలితం అనుభవించక మానరు’ అని పెద్దలు చెబుతుంటారు. ఈ వీడియో చూస్తే తప్పకుండా మీరూ అవునని అంటారు. రైలులోని తలుపు దగ్గర నిల్చున్న ఓ వ్యక్తి.. అప్పుడే అటుగా వచ్చిన మహిళ మెడలో నుంచి చైన్ లాగాడు. కట్ చేస్తే.. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

Viral: మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు.. సీన్ కట్ చేస్తే.!
Viral Video
Follow us on

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్.. ‘ఎవరు చేసిన కర్మఫలం.. వారు ఎప్పటికైనా ఫలితం అనుభవించక మానరు’ అని పెద్దలు చెబుతుంటారు. ఈ వీడియో చూస్తే తప్పకుండా మీరూ అవునని అంటారు. రైలులోని తలుపు దగ్గర నిల్చున్న ఓ వ్యక్తి.. అప్పుడే అటుగా వచ్చిన మహిళ మెడలో నుంచి చైన్ లాగాడు. కట్ చేస్తే.. ఆ మరుసటి క్షణం కదులుతున్న రైలు నుంచి దూకేశాడు. ఇక ఈ వీడియో చూసినవాళ్లంతా ఎవరి కర్మను వారనుభవించక తప్పదు అని కామెంట్ చేస్తున్నారు.

వైరల్ వీడియో ప్రకారం.. ఈ ఘటన మార్చి 13 సుమారు 7 గంటల సమయంలో జరిగినట్టు తెలుస్తుంది. కదులుతున్న రైలులోని కంపార్ట్‌మెంట్ తలుపు దగ్గర ఓ వ్యక్తి నిల్చుని ఉన్నట్టు చూడవచ్చు. ఈలోగా బాత్‌రూమ్ వైపునకు ఇద్దరు మహిళలు వస్తారు. ఇక అందులోని ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాక్కుని.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు. ఇక ఈ ఘటన మొత్తం రైలు లోపల అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రైలు నుంచి దూకిన అనంతరం నిందితుడికి గాయాలు అయినట్టు కనిపిస్తుంది. దొంగతనం సమయంలో వృద్దురాలికి గాయాలు కాగా.. ఆ నిందితుడు కూడా రైలులో నుంచి పడిపోయి.. గాయాలపాలయ్యాడు. ఆ దొంగకు కర్మఫలం వెంటనే లభించిందని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియో చూసేయండి.