Viral News: జస్ట్ తిడితే చాలు.. డబ్బులే డబ్బులు.. ఎక్కడో తెలుసా?.. ఆసక్తికర వివరాలివే..

Viral News: సోషల్ మీడియాలో నిత్యం అనేక వార్తలు సర్క్యూలేట్ అవుతుంటాయి. వాటిలో కొన్ని కొన్ని విషయాలు నమ్మశక్యం కానివి కూడా ఉంటాయి. కానీ నమ్మక తప్పదు.

Viral News: జస్ట్ తిడితే చాలు.. డబ్బులే డబ్బులు.. ఎక్కడో తెలుసా?.. ఆసక్తికర వివరాలివే..
Money

Viral News: సోషల్ మీడియాలో నిత్యం అనేక వార్తలు సర్క్యూలేట్ అవుతుంటాయి. వాటిలో కొన్ని కొన్ని విషయాలు నమ్మశక్యం కానివి కూడా ఉంటాయి. కానీ నమ్మక తప్పదు. సోషల్ మీడియాను చాలా ఎర్నింగ్(సంపాదన) సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ఇంకొంతమంది తమ తెలివి తేటలతో ఈజీగా మనీ సంపాదిస్తారు. కానీ ఇక్కడ ఒక మహిళ మనుషుల్ని తిట్టి డబ్బు సంపాదిస్తోంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజ్జంగా నిజం. మరి ఈ తిట్టడం ఏంది?.. తిట్టడం ద్వారా డబ్బులు సంపాదించడం ఏంది? అనేగా మీ డౌటనుమానం. సరే ఆ వివరాలేంటో ఇప్పుడే తెలుసుకుందాం పదండి.

నిక్కీ ఫాక్స్.. ఈమె గురించి విదేశాల్లో చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఈమె ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈమె ఏం చేసినా దానిపైన చర్చ జరిగి తీరుతుంది. డల్లాస్‌కి చెందిన నిక్కీ ఫాక్స్‌కి సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ భారీగానే ఉంది. అందువల్ల ఆమె తరచూ ఫన్నీ వీడియోలు, పర్సనల్ వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటుంది. అలా వీడియోలు పోస్ట్ చేస్తూ.. సెలబ్రిటీగా మారిన నిక్కీ ఫాక్స్ ఈ మధ్య ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. నిక్కీ ఫాక్స్‌తో ఆ మధ్య ఓ వ్యక్తి చాట్ చేశాడట. తనను తిడుతూ వీడియో పోస్ట్ చేస్తే 7 వేల రూపాయలు ఇస్తానన్నాడట. అందుకు నిక్కీ ఒప్పుకోలేదట. తాను అలాంటి వీడియోలు పోస్ట్ చేసే ప్రసక్తే లేదని చెప్పిందట. కావాలంటే ఆడియో రూపంలో తిట్టి.. దాన్ని పంపిస్తానని చెప్పిందట. అందుకు ఆ వ్యక్తి సరే అన్నాడట. దాంతో రకరకాల తిట్లతో ఆడియో మెసేజ్ పంపిందట నిక్కీ. దాంతో అతనికి ఆ తిట్లు నచ్చడంతో.. అతను మరో ఆడియో కావాలంటూ రెండోసారి మరో 7 వేల రూపాయలు ఇచ్చాడట. అలా మరికొంతమంది కూడా డబ్బులిచ్చి ఆమెతో తిట్టించుకుంటున్నారట. ఇదేదో బావుంది అనుకున్న నిక్కీ దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తుందట. తనకు ఇష్టం లేకపోయినా వచ్చే డబ్బును వదులుకోవడం ఎందుకని కంటిన్యూ చేస్తున్నానని నిక్కీ చెబుతోంది.

ఇలా ఎందుకు వాళ్లు తనకు డబ్బులిచ్చి మరీ తిట్టించుకుంటున్నారో నిక్కీకి మొదట అర్ధం కాలేదట. తర్వాత విషయం తెలిసి ఆశ్చర్యపోయిందట. వాళ్లు కావాలనే తమపై నెగెటివ్ పబ్లిసిటీ చేయించుకొని.. తమ అభిమానుల నుంచి జాలిని పొందడానికి ప్రయత్నిస్తున్నారట. ఇదో రకమైన స్ట్రాటజీ. అందుకు వారు నిక్కీతో తిట్టించుకొని.. ఆ వాయిస్‌ను సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. తద్వారా ప్రజల్లో వారిపై తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ఆ తర్వాత అవన్నీ పుకార్లే అని తేల్చి.. తాము మంచివాళ్లం అని నిరూపించుకుంటున్నట్లు డ్రామా లాడుతున్నారు. ఇది నిక్కీకి కలిసొస్తోంది. ఈ నిజాన్ని చెబుతూ.. నిక్కీ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. తిట్లకు సంబంధించిన ఆడియో మెసేజ్‌లు ఎవరి నుంచి ఎవరికైనా రావొచ్చన్న ఆమె.. ప్రతీదీ నమ్మేయవద్దని కోరింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కొంత మంది తమకూ ఇలా సంపాదించే వీలు ఉంటుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also read:

Power Lifter: వందేళ్ల వయస్సులోనూ ‘తగ్గేదే లే’ అంటున్న బామ్మ.. చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..

Nature of Earth: భూమిపై మరణం లేని జీవులు కూడా ఉన్నాయని మీకు తెలుసా?.. ఆసక్తికర విశేషాలు మీకోసం..!

Telangana Fears Tiger: తెలంగాణను బెంబేలెత్తిస్తున్న పెద్ద పులులు.. ఏక కాలంలో రెండు పులుల దాడులు..

Click on your DTH Provider to Add TV9 Telugu