
ఇప్పుడు మన బైక్స్ రోడ్డు పక్కన పార్క్ చేశారు అనుకోండి.. పోలీస్ వారు వెహికల్‌తో వచ్చి రాంగ్ పార్కింగ్ అని తీసుకెళ్లిపోతారు. ఆ బైక్ ఒక్కసారి వారి వాహనం పైకి ఎక్కించారంటే.. మళ్లీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫైన్ కట్టి తెచ్చుకోవాల్సిందే. ఎక్కించేటప్పుడు చూసినా.. సరే ఎంత బ్రతిమాలినా సరే పోలీసువారు ఇవ్వరు. రూల్స్ పాటించాల్సిందే అంటారు. అయితే ఇక్కడ మాత్రం ఓ అమ్మాయి తన స్కూటీని తిరిగి వెనక్కి తీసుకోచ్చుకోగలిగింది. అందుకు తను వాడిన అస్త్రం ఏంటో తెలుసా..? ఏడుపు. అవును.. తన బైక్ పోలీస్ వాహనంపైకి ఎక్కించాక ఆ యువతి అక్కడికి చేరుకుంది. వెనక ఉన్నవారిని తన వాహనం ఇవ్వాల్సిందిగా కోరింది. కాసేపు ఆ వాహనం పట్టుకుని అక్కడే నిలబడింది. అయితే వెహికిల్ తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరించారు. దీంతో ఏడ్చుకుంటూ వాహనంలో ముందు కూర్చున్న పోలీస్ ఆఫీసర్ వద్దకు వెళ్లి తన స్కూటీ ఇవ్వాలని ఏడుస్తూ అడిగింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆ అధికారి.. ఏం చేయాలో అర్థం కాక కాసేపు నవ్వుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ వారి వాహనం కాస్త ముందుకు కదిలింది. దీంతో మరోసారి.. ఆ యువతి ఆ వాహనాన్ని పట్టుకోవడంతో.. వారు దాన్ని నిలిపివేశారు.
ఈ సమయంలో ఆ యువతి స్నేహితురాలితో పాటు.. రోడ్డు పక్కన ఉన్న ఓ బాటసారి వచ్చి బైక్ ఇచ్చేయాలని పోలీస్ వారిని కోరారు. దీంతో కన్విన్స్ అయిన పోలీస్ అధికారి.. ఆ వాహనాన్ని ఇచ్చేశారు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి.. షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. మా అబ్బాయిలు కాళ్లు పట్టుకున్నా ఇవ్వరు కదా సార్ అని ఒకరు కామెంట్ పెట్టగా.. ఆడాళ్ల వెపన్ ఏడుపు.. వారు దానితో దేన్నైనా సాధించగలరు అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..