Watch: ప్రపంచంలోనే అతి చిన్నగణపయ్య.. ఖరీదు తెలిస్తే కంగుతింటారు..! గిన్నిస్ రికార్డ్‌కు దరఖాస్తు..

ఈ విగ్రహాలను తయారు చేయడానికి దాదాపు 15 నుండి 20 రోజులు పట్టింది. 40 మంది కళాకారుల బృందం ఈ పనిలో పగలు, రాత్రి పనిచేసిందని చెప్పారు. ఇంత చిన్న విగ్రహం అయినప్పటికీ, దాని స్పష్టత చాలా గొప్పగా ఉంది.10 అడుగుల విగ్రహంలో గణేశుడి ముఖంలో స్పష్టత, అలంకరణ కూడా ఈ 1 అంగుళం విగ్రహంలో స్పష్టంగా కనిపిస్తుంది.

Watch: ప్రపంచంలోనే అతి చిన్నగణపయ్య.. ఖరీదు తెలిస్తే కంగుతింటారు..! గిన్నిస్ రికార్డ్‌కు దరఖాస్తు..
Smallest Ganesha Idol

Updated on: Aug 26, 2025 | 9:26 PM

ప్రపంచ వ్యాప్తంగా గణపతి నవరాత్రులు అత్యంత ఘనంగా, వైభవోపేతంగా నిర్వహిస్తారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆ గణనాధుడిని పూజిస్తారు. వీధికో గణపయ్య, ఈ నవరాత్రులు ఊరువాడా, పల్లె పట్నం తేడా లేకుండా గల్లీకో గణపయ్య, వీధికో లంబోధరుడు కోలువుదీరి భక్తుల్ని కరుణిస్తాడు. ఒకరి మించి మరొకరు భారీ నుంచి అతి భారీ విగ్రహాలను పెట్టి మురిసిపోతుంటారు భక్తజనం. అయితే, మీరు ఎప్పుడైనా అతి చిన్న గణపయ్యను చూశారా.? అవును.. సూరత్‌కు చెందిన ఒక బంగారు ఆభరణాల షాపు యజమాని ఒకే అంగుళంలో వినాయకుడు, లక్ష్మిదేవీ విగ్రహాలను తయారు చేశారు.

సూరత్‌లోని ఒక ఆభరణాల వ్యాపారి ప్రపంచంలోనే అతి చిన్న 22 క్యారెట్ల బంగారు గణేశుడు, లక్ష్మీదేవి విగ్రహాలను సృష్టించారు. ఈ విగ్రహాలు కేవలం 1 అంగుళం పొడవు, 10 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. 3D ప్రింట్ టెక్నాలజీతో ‘జీరో డిఫెక్ట్’ నాణ్యతతో రూపొందించబడ్డాయి. ఒక్కో విగ్రహం ఖరీదు దాదాపు రూ. 1.5 లక్షల రూపాయలు ఉంటుందని, దాని హస్తకళ చాలా క్లిష్టంగా ఉందని, 10 అడుగుల విగ్రహం ఉన్నంత స్పష్టత ఈ 1 అంగుళం విగ్రహంలో కూడా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

గణేష్ చతుర్థి, దీపావళికి ముందు డిమాండ్ పెరుగుతున్న ఈ ప్రత్యేకమైన సృష్టిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేర్చాలని దరఖాస్తు చేశారు..ఈ విగ్రహాలను తయారు చేయడానికి దాదాపు 15 నుండి 20 రోజులు పట్టింది. 40 మంది కళాకారుల బృందం ఈ పనిలో పగలు, రాత్రి పనిచేసిందని చెప్పారు. ఇంత చిన్న విగ్రహం అయినప్పటికీ, దాని స్పష్టత చాలా గొప్పగా ఉంది.10 అడుగుల విగ్రహంలో గణేశుడి ముఖంలో స్పష్టత, అలంకరణ కూడా ఈ 1 అంగుళం విగ్రహంలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..