124 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న వృద్ధుడు.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడుగా రికార్డ్ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు..

పెరూకు చెందిన మార్సెలినో అబాద్ తన 124వ పుట్టినరోజుని కుటుంబ సభ్యుల మధ్య అత్యంత ఘనంగా జరుపుకున్నారు. పెరువియన్ ప్రభుత్వం మార్సెలినో అబాద్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద వ్యక్తిగా పేర్కొంది. మార్సెలినో అబాద్ 1900లో జన్మించాడు. ఇటీవలే తన 124వ పుట్టినరోజును కేక్ కట్ చేసి జరుపుకున్నాడు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్‌గా మారింది.

124 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న వృద్ధుడు.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడుగా రికార్డ్ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు..
World's Oldest Human Marcelino Abad

Updated on: Apr 11, 2024 | 11:18 AM

ప్రస్తుతం మారిన జీవన విధానం, అలవాట్లతో ఆయుస్సు తగ్గుతోంది. నూరేళ్ల బతకాల్సిన వారు 60 ఏళ్లకే మరణిస్తున్నారు. అయితే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఆడుతూ పాడుతూ కూడా కుప్పకూలిపోతున్నారు. అయితే దక్షిణ అమెరికాకి చెందిన ఓ వృద్ధుడు తన 124వ పుట్టినరోజును ఏప్రిల్ 5వ తేదీన జరుపుకున్నాడు. పెరూకు చెందిన మార్సెలినో అబాద్ తన 124వ పుట్టినరోజుని కుటుంబ సభ్యుల మధ్య అత్యంత ఘనంగా జరుపుకున్నారు. పెరువియన్ ప్రభుత్వం మార్సెలినో అబాద్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద వ్యక్తిగా పేర్కొంది. మార్సెలినో అబాద్ 1900లో జన్మించాడు. ఇటీవలే తన 124వ పుట్టినరోజును కేక్ కట్ చేసి జరుపుకున్నాడు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్‌గా మారింది.

అందమైన పచ్చటి వాతావరణం, 124 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించడానికి పెరూలోని హువానుకో స్వచ్ఛమైన గాలి అని చెబుతున్నాడు అబాద్. అంతేకాదు తాము పండించిన గొర్రె మాంసం, కూరగాయలను వినియోగిస్తున్నట్లు పెరూ ప్రభుత్వ ప్రకటన ద్వారా తెలిసింది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అబాద్‌కు సహాయం చేస్తున్నామని పెరూ అధికారులు తెలిపారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి అనే బిరుదు 114 ఏళ్ల వెనిజులా వ్యక్తికి ఇవ్వబడింది. ఇప్పుడు పెరూ ప్రభుత్వం మార్సెలినో అబాద్ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కోసం దరఖాస్తు చేయాలని నిర్ణయించింది. చిన్న పట్టణం చాగ్లాలో జన్మించిన అబాద్‌ను 2019లో పెరూ ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు ప్రభుత్వ ID , పెన్షన్ ఇస్తుంది కూడా..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..