Kabaddi Video: భారతీయ సంప్రదాయ చీరలు కట్టుకుని కబడ్డీ ఆడిన మహిళలు.. బాల్యం గుర్తుకొస్తుంది అంటోన్న నెటిజన్లు..

ఈ అద్భుతమైన మహిళల కబడ్డీ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'హమ్ కిసీ సే కమ్ హై క్యా .. మనం ఎవరికంటే తక్కువా ఏమిటి అంటూ ఛత్తీస్‌గఢియా ఒలింపిక్స్‌లో మహిళల కబడ్డీ' అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. 51 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పటి వరకు వేలాది సార్లు వీక్షించబడింది.

Kabaddi Video: భారతీయ సంప్రదాయ చీరలు కట్టుకుని కబడ్డీ ఆడిన మహిళలు.. బాల్యం గుర్తుకొస్తుంది అంటోన్న నెటిజన్లు..
Kabaddi Video

Updated on: Oct 08, 2022 | 8:31 AM

మన దేశ చరిత్రలో అతిపురాతన ఆట కబడ్డీ. ఒకప్పుడు ఈ ఆటను వీధుల్లో మాత్రమే చూసేవారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ ఆటకు ప్రాముఖ్యత పెరిగింది. ప్రొ-కబడ్డీ లీగ్ మొదలు పెట్టిన తర్వాత మన రాష్ట్ర క్రీడ మరింత మందికి చేరువైంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ టోర్నీలో దేశం నలుమూలల నుంచి 12 జట్లు పాల్గొంటున్నాయి. అయితే చిన్నతనంలో ప్రతి ఒక్కరూ ఆడిన ఆట కబడ్డీ.. ఎక్కువగా పురుషులు ఆడడం చూసినా.. అమ్మాయిలు కూడా కబడ్డీ క్రీడలో ప్రతిభను చూపించేవారున్నారు. అయితే చీరలు కట్టుకుని కబడ్డీ ఆడటం మీరు ఎప్పుడైనా చూశారా? అవును ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇది ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు. అంతేకాదు మహిళలు నిజంగా ఎవరికన్నా తక్కువ కాదు అని అనుకుంటారు కూడా..

మహిళలు చీరలు కట్టుకుని ఎలా కబడ్డీ ఆడుతున్నారో వీడియోలో చూడొచ్చు, ప్రేక్షకులు కూడా వీరి కబడ్డీ ఆడడం చూస్తూ చాలా బిజీగా ఉన్నారు. క్రీడా ప్రేక్షకులు క్రీడాకారులను ఓ రేంజ్ లో ప్రోత్సహిస్తున్నారు.  మహిళలు కూడా అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఆడినట్లు ఆడుతున్నారు. ఈ మహిళల కబడ్డీ ఛత్తీస్‌గఢియా ఒలింపిక్స్‌లో భాగమని చెబుతున్నారు. వాస్తవానికి, ఛత్తీస్‌గఢ్‌లోని సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడానికి, ఛత్తీస్‌గఢ్ ఒలింపిక్స్ ప్రారంభించబడ్డాయి. ఇందులో గిల్లి దండా నుండి పిట్టూల్, లాంగ్డీ రన్, కబడ్డీ, ఖో-ఖో, రోసాక్సీ  బాటి వరకు 14 రకాల ప్రాంతీయ క్రీడలు చేర్చబడ్డాయి.

ఇవి కూడా చదవండి

సరే, మహిళల ఈ అద్భుతమైన కబడ్డీ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు  ‘హమ్ కిసీ సే కమ్ హై క్యా .. ఛత్తీస్‌గఢియా ఒలింపిక్స్‌లో మహిళల కబడ్డీ’ అనే క్యాప్షన్‌లో రాశారు

భారతీయ సంప్రదాయ చీరలో కబడ్డీ 

51 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాది సార్లు వీక్షించగా, వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి వివిధ రకాల రియాక్షన్‌లు కూడా ఇచ్చారు. ఒకరు ‘ఛత్తీస్‌గఢియా ఉత్తమమైనది’ అని రాశారు. మరొక వినియోగదారు తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ‘బాల్యంలో ఖో-ఖో.. కబడ్డీ కబడ్డీ ఆడేవారం అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మేమంతా స్కూల్లో చాలా ఆడుకునేవాళ్లమని ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..