
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్ల మధ్య ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’ (Work-Life Balance) గురించి పెద్ద చర్చకు దారితీసింది. సినిమా హాల్‌లో సినిమా చూస్తూ కూడా ల్యాప్‌టాప్‌పై పని చేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని ఉదంతం ఈ చర్చకు కారణంగా మారింది. సినిమా థియేటర్‌లో అందరూ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) సినిమాను ఆస్వాదిస్తుంటే, ఒక మహిళ మాత్రం తన ల్యాప్‌టాప్ తెరిచి ఆఫీస్ పనిలో నిమగ్నమై ఉంది. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. ‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్’ (Work From Anywhere) అనే సంస్కృతి సానుకూలమా లేక ప్రతికూలమా అనే దానిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఇటీవల విడుదలైన ‘ధురంధర్ 2’ సినిమాను చూడటానికి వెళ్లిన ఒక మహిళా టెక్కీ, థియేటర్ సీట్లో కూర్చుని తన ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి పని చేయడం కనిపించింది. సినిమా నడుస్తున్నా ఆమె మాత్రం స్క్రీన్ వైపు చూస్తూ సీరియస్‌గా మెయిల్స్ పంపడం లేదా కోడింగ్ చేయడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఆమె పక్కన ఉన్న వ్యక్తి ఈ వింత దృశ్యాన్ని తన ఫోన్లో చిత్రీకరించి ఇంటర్నెట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పాపం, కనీసం సినిమా చూసే టైమ్ కూడా ఇవ్వని ఆ కంపెనీ ఏదో చెప్పండి అని కొందరు సానుభూతి తెలుపుతున్నారు. వినోదానికి వచ్చే చోట కూడా పని చేయాల్సి రావడం మానసిక ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు.
సినిమా చూసేటప్పుడు పక్కన ల్యాప్‌టాప్ లైటింగ్ ఉంటే డిస్టర్బింగ్‌గా ఉంటుంది. పని ఉంటే ఇంటి దగ్గరే ఉండి చేసుకోవాలి కానీ, ఇలా థియేటర్‌కు రావడం ఏంటి? అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ వల్ల ఎక్కడి నుంచైనా పని చేసే సదుపాయం ఉన్నా, అది మనిషికి ప్రైవసీ లేకుండా చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఎందుకంటే..ఇంతకుముందు బెంగళూరులో ఒక వ్యక్తి బైక్ నడుపుతూ ల్యాప్‌టాప్‌లో పని చేసిన వీడియో కూడా ఇలాగే వైరల్ అయ్యింది. ఇప్పుడు థియేటర్ ఘటన కూడా దానికి కొనసాగింపుగా కనిపిస్తోంది. పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య గీత మాయమైపోతున్న ఈ తరుణంలో, సంస్థలు తమ ఉద్యోగుల మానసిక స్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానసిక విశ్లేషకులు కోరుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..