Viral Video: మందు బాటిళ్లపై మతిపోగొట్టే ఫోజు.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!

ఆరోగ్యం కోసం యోగా చేస్తే మంచిది. కానీ అవతలివారిని ఆకర్షించడానికి ఆసనాలు వేస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు..

Viral Video: మందు బాటిళ్లపై మతిపోగొట్టే ఫోజు.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!
Goddess Pose

Updated on: Jun 29, 2021 | 1:09 PM

ఆరోగ్యం కోసం యోగా చేస్తే మంచిది. కానీ అవతలివారిని ఆకర్షించడానికి ఆసనాలు వేస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా రకరకాల భంగిమలను పోస్ట్ చేస్తూ వాళ్లను వాళ్లు ప్రమోట్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. సరిగ్గా అదే విధంగా ఓ చిత్రమైన ఫోజును ట్రై చేసిన ఓ యువతి.. అది కాస్తా ఫెయిల్ కావడంతో బొక్కబోర్లా పడింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో తరచుగా ఎన్నో రకాల ఛాలెంజ్‌లు, స్టంట్స్, ట్రెండ్స్ పాపులర్ అవుతుంటాయి. అలాంటి ఓ ఫీట్‌ను తాజాగా ఆ యువతి ప్రయత్నించింది. టేబుల్‌పై రెండు మందు బాటిళ్లు పెట్టి.. వాటిపైన నిల్చోడానికి ప్రయత్నించింది. అది అత్యంత ప్రమాదకరమైన ఫోజు అని చెప్పొచ్చు. ఇంకేముందు అలా ప్రయత్నించిందో లేదో.. బ్యాలెన్స్ తప్పింది.. బొక్కబోర్లా పడింది. అయితే ఆ తర్వాత యువతికి ఏం జరిగింది.? అసలు ఆ వీడియో ఎక్కడి.? అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ వీడియోను ‘హోల్డ్ మై బీర్’ అనే ట్విట్టర్ అకౌంట్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది.

Also Read:

పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రావొద్దు.. వీడియోను నవ్వకుండా చూడండి మీకోసమే.!

బర్త్‌డే పార్టీకి సింహం చీఫ్ గెస్ట్.. వైరల్‌గా మారిన వీడియో.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్!

రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్.. గింగిరాలు తిరిగిన ఆటో.. షాకింగ్ దృశ్యాలు వైరల్!

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి 

Loading...
Unable to load recommendations.
Follow Us