Watch: ఎవరు తల్లీ నువ్వు..! రన్నింగ్‌ రైళ్లో ఇవేం పిచ్చిపనులు..? ఏం చేసిందంటే..

లోకల్ ట్రైన్ లో చీర కట్టుకుని ప్రయాణిస్తున్న ఒక మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె కదులుతున్న రైలు నుండి ఎదురుగా వస్తున్న మరో రైలుపై రాళ్ళు విసురుతున్న దృశ్యం అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో చూసిన ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Watch: ఎవరు తల్లీ నువ్వు..! రన్నింగ్‌ రైళ్లో ఇవేం పిచ్చిపనులు..? ఏం చేసిందంటే..
Woman Attacks Loco Pilot With Stone

Updated on: Oct 18, 2025 | 8:49 AM

పట్టాలపై నడుస్తున్న లోకల్‌ రైలులో ఒక షాకింగ్‌ సీన్‌ కనిపించింది. వేగంగా వెల్తోన్న రైలు తలుపు వద్ద చీర ధరించిన ఒక మహిళ నిలబడి కనిపించింది. ఆ మహిళ చేసిన పని ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఆగ్రహానికి గురిచేసింది. కదులుతున్న రైలు తలుపు వద్ద మహిళ నిలబడి ఉండగా, ఆ పక్కన పట్టాలపై ఎదురుగా మరొక లోకల్ రైలు అధిక వేగంతో వెళుతోంది. ఇంతలోనే ఆ మహిళ చేసిన పని అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. అకస్మాత్తుగా ఆమె తన చేతిలో పట్టుకున్న రాయిని నేరుగా లోకో పైలట్ సీటు వైపు, అంటే రైలు ముందు విండ్‌షీల్డ్ వైపు విసిరింది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో ఇంకా నిర్ధారించబడలేదు. కానీ, వీడియో మాత్రం వేగంగా వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ వీడియోలో మహిళ చేసిన ప్రమాదకరమైన చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ఎదురుగా వస్తున్న రైలు ఇంజిన్ విండ్ షీల్డ్ పై పెద్ద రాయితో దాడి చేసింది. ఆమె రాయిని విసరడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇది ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. చాలా మంది నెటిజన్లు ఆమె చేసిన పనిని చట్టవిరుద్ధం మాత్రమే కాదు, ప్రాణాంతకం కూడా అంటూ మండిపడ్డారు.. ఆ రాయి ప్రయాణీకుడు లేదా కిటికీ అద్దాన్ని తాకి ఉంటే అది పెద్ద ప్రమాదానికి కారణమయ్యేది అంటూ చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

రైల్వే యంత్రాంగం ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేధికగా నెటిజన్లు మండిపడ్డారు. అలాంటి వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలి అని ఒకరు రాశారు. మరొకరు ఇది కేవలం అల్లరితనం, చిలిపి పని కాదు, ఇది నేరం. ప్రజల ప్రాణాలకు ముప్పు అని అన్నారు. వీడియోను చిత్రీకరిస్తున్న వ్యక్తి ఆ మహిళను ఆపడానికి ఎందుకు ప్రయత్నించలేదని కూడా కొందరు ప్రశ్నించారు. చాలా మంది వినియోగదారులు ఆ మహిళ మానసిక స్థితి సరిగా లేనట్టుగా కనిపిస్తుందని అంటున్నారు. అయినప్పటికీ అలాంటి ప్రవర్తనను విస్మరించ కూడదని అంటున్నారు.

ఈ వీడియోను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేశారు, దీనిని @gharkekalesh X లో షేర్ చేశారు. ఈ క్లిప్‌కు దాదాపు 2 లక్షల వ్యూస్‌, 1 వెయ్యికి పైగా లైక్‌లు వచ్చాయి. వందలాది మంది వినియోగదారులు స్పందించారు. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం, కదులుతున్న రైలు తలుపు వద్ద నిలబడటం లేదా కిటికీలోంచి తల లేదా చేతులను బయటకు పెట్టడం ఇప్పటికే నిషేధించబడింది. కాబట్టి, రాళ్లు విసరడం నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా క్రిమినల్ నేరం కూడా అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..