Viral: మాంచిగా పులుస పెట్టి తిందామని చేపలు తీసుకొచ్చింది.. తీరా ఇంటికొచ్చి ఒకదాన్ని కోయగా

|

Aug 30, 2023 | 8:00 PM

ఫిలిప్పీన్స్‌లో నివసిస్తున్న ఓ మహిళ మార్కెట్‌లో చేపలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చింది. వాటిని ఇంటికి తీసుకొచ్చి కోసేసరికే ఆమె మనసంతా కకావికలమైంది. అరె.. మంచిగా పులుసు పెట్టి తిందామనకుంటే ఇలా జరిగిందేంటని బాధ పడింది. అసలు ఇంతకీ ఏమయ్యింది. చేప కడుపులో ఏమైనా ఉన్నాయా..? లేదా ఆ చేప అనారోగ్యానికి గురైందా..? ఇంకేమైనా కారణమా..? ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Viral: మాంచిగా పులుస పెట్టి తిందామని చేపలు తీసుకొచ్చింది.. తీరా ఇంటికొచ్చి ఒకదాన్ని కోయగా
Fish
Follow us on

ఈ రోజుల్లో రెస్టారెంట్ లేదా హోటల్‌లో తినడం చాలా కామన్ అయిపోయింది. బోర్ కొట్టినప్పుడల్లా బయటకు వెళ్లి తినేద్దాం అని ఈజీగా అనేస్తున్నారు. అయితే బయటి ఫుడ్ అదే పనిగా తినడం కూడా మంచిది కాదు. అది టేస్ట్ రావడం కోసం, అందంగా కనిపించడం కోసం.. కొన్ని రెస్టారెంట్స్ వాళ్లు రకరకాల రంగులు, మసాలాలు కలపడం వంటివి చేస్తుంటారు. అందుకే కొంతమంది బయట ఫుడ్ అస్సలు తినరు. ఎంత లేటైనా సరే.. ఇంటికి వెళ్లి కుక్ చేసుకుని తింటుంటారు. అలాంటివారు మీ బ్యాచ్‌లో కూడా ఉండే ఉంటారు. ఇక నాన్ వెజ్ ఫుడ్ మాత్రమే బయట తినని వాళ్లు కూడా ఉంటారు. ఎందుకంటే క్వాలీటీ లేని మాంసాన్ని హోటల్ లేదా రెస్టారెంట్ వాళ్లు కుక్ చేస్తారన్నది వారి అనుమానం. అలానే శుభ్రత పాటించరన్న భయం కూడా ఉంటుంది.  ఆర్డర్ చేసిన తినుబండారాల్లో ఎలుకలు, కప్పలు, పాములు, ఈగలు, ఇతర కీటకాలు వచ్చిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది.

నిజానికి, ఒక మహిళ కూర చేసేందుకు మార్కెట్‌కు వెళ్లి చేపలు కొన్నది. అయితే అందులో ఒక చేపకు మనిషి మాదిరిగా పళ్లు ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ ఘటర ఫిలిప్పీన్స్‌లో వెలుగుచూసింది. మరియా క్రిస్టినా కుసీ అనే మహిళ తాను మార్కెట్‌కి వెళ్లానని, అక్కడి నుంచి చాలా రకాల చేపలు కొన్నానని, అయితే అందులో ఒక చేపను శుభ్రం చేస్తుండగా షాక్‌కు గురయ్యానని చెప్పింది. ఆమె చేపను కోసిన వెంటనే, దానికి మనిషిలాంటి దంతాలు ఉండటం చూసి ఆమె భయపడింది. మొదట ఆ పళ్ల సెట్ మనిషికి చెందిదేమో అనుకుంది. కానీ పూర్తిగా చెక్ చేసిన తర్వాత, ఆ పళ్లు చేపవే అని నిర్ధారించుకుంది.

అయినా సరే.. దాన్ని పులుసు పెట్టేందుకు ఆమెకు మనసు అంగీకరించలేదు. దీంతో  తర్వాత ఆ చేపను దూరంగా చెత్త బుట్టులో పడేసి వచ్చింది. ఆ చేప ధర 4 డాలర్లు అంటే దాదాపు 320 రూపాయలు అట. నివేదికల ప్రకారం, ఆ చేప పేరు బిగ్ హెడ్ కార్ప్, దీనిని ఇమెల్డా అని కూడా పిలుస్తారు. తూర్పు ఆసియాలోని ప్రజలు ఈ మంచినీటి చేపలను తినడానికి ఇష్టపడతారు. వింత చేపలు మన ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడు తారసపడుతూనే ఉంటాయి. అయితే అలాంటి వాటిని తినడానికి కొందరికి నిజంగానే మనసు ఒప్పదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..