సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని అయితే అసలు ఇలా కూడా జరుగుతాయా అని డౌట్ వచ్చేలా చేస్తాయి. సరిగ్గా ఈ కోవకు చెందిన ఓ వైరల్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ చేసిన దొంగతనం స్టైల్ చూస్తే మీరూ ఆశ్చర్యపోవడం గ్యారెంటీ..
ఓ జ్యువెలరీ షాప్‌కి ఓ జంట గిఫ్ట్ బాక్స్ పట్టుకుని వచ్చినట్లు మీరు వీడియో చూడవచ్చు. వాళ్లను చూసినప్పుడు మీకసలు ఎలాంటి డౌట్ రాదు. వీళ్లు దొంగతనం చేస్తారా అని అస్సలు అనుకోరు. షాపులోకి రాగానే దుకాణదారుడిని ఉంగరం చూపించమని అడుగుతారు. దుకాణదారుడు కొన్ని డిజైన్స్ చూపిస్తాడు. అయినా అది వాళ్లకు నచ్చదు. మరికొన్ని చూపించేందుకు అతడు వెనక్కి తిరగగా.. ఆ మహిళ తాను వెంటపెట్టుకుని తీసుకొచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో ఖరీదైన నెక్లెస్ దాచిపెట్టేస్తుంది. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆమె దొంగతనం చూసి నెటిజన్లు బిత్తరపోతున్నారు.
కాగా, ఈ వీడియోను ‘jatts.plaza’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు 3 లక్షల 94 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను వేలాది మంది లైక్ చేశారు. ‘క్యా మైండ్ హై బ్రదర్’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇది జస్ట్ ప్రాంక్ వీడియో అయి ఉంటుందని’ అని మరొకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోపై లుక్కేయండి.