అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..డబుల్‌ రేట్‌ పెట్టి కొంటున్న మగాళ్లు! టేస్ట్‌ కోసం ఏం చేస్తుందంటే..

సోషల్ మీడియా ప్రపంచంలో పాపులారిటీ లేదా వ్యూస్ కోసం జనాలు ఎలాంటి విచిత్రమైన పనులు చేయడానికైనా వెనకాడటం లేదు. ముఖ్యంగా వంటకాలకు సంబంధించిన ఫుడ్ వ్లాగ్స్ (Food Vlogs) లో రోజుకో కొత్త ప్రయోగం వెలుగులోకి వస్తోంది. అయితే, తాజాగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఒక వీడియో మాత్రం వీక్షకులకు తీవ్ర ఆగ్రహాన్ని, అసహ్యాన్ని కలిగిస్తోంది. ఒక యువతి బ్రెడ్ తయారు చేయడానికి ఉపయోగించే పిండిని చేతులతో కాకుండా, నేరుగా తన కాళ్లతో తొక్కుతూ కలపడం నెట్టింట తీవ్ర దుమారం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..డబుల్‌ రేట్‌ పెట్టి కొంటున్న మగాళ్లు! టేస్ట్‌ కోసం ఏం చేస్తుందంటే..
Foot Kneading Bread Dough

Updated on: Jun 22, 2026 | 7:17 PM

సోషల్ మీడియా యుగంలో ప్రతి విలక్షణమైన ప్రయోగం వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ విచిత్రమైన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ వేదికగా తీవ్రమైన చర్చకు, వివాదానికి దారితీసింది. ఆ వీడియోలో ఒక యువతి బ్రెడ్ తయారీ కోసం పిండిని చేతులతో కాకుండా తన కాళ్లతో తొక్కుతూ కలుపుతోంది. దీనిని ఒక సాంప్రదాయ బేకింగ్ పద్ధతిగా, దీనివల్ల బ్రెడ్‌కు అదనపు ఈస్ట్ ఫ్లేవర్ (Extra yeasty flavour) వస్తుందని కొందరు సమర్థిస్తుండగా, నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఆ యువతి ఒక పెద్ద పాత్రలో ఉంచిన బ్రెడ్ పిండిని తన రెండు కాళ్లతో తొక్కుతూ, పదే పదే నలుపుతూ కలిపింది. అయితే, ఇదంతా చూస్తున్న వారికి తీవ్ర అసహ్యం కలిగించినప్పటికీ, ఆమె మాత్రం దీని వెనుక ఒక వింత కారణాన్ని చెప్పుకొచ్చింది. ఇలా కాళ్లతో పిండిని కలపడం అనేది ఒక పురాతన, సాంప్రదాయ బేకింగ్ పద్ధతి (Traditional Baking) అని ఆమె పేర్కొంది. అంతేకాకుండా, ఇలా చేయడం వల్ల పిండిలో ఒక ప్రత్యేకమైన పులియబెట్టే గుణం (Extra yeasty flavour), ఒక నట్టి (Nutty) టేస్ట్ వస్తుందని సదరు యువతి వాదించింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షం కావడమే ఆలస్యం.. క్షణాల్లో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఆహార ప్రియులు సదరు యువతిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆహార పరిశుభ్రత (Hygiene controversy) కు సంబంధించిన నిబంధనలను పూర్తిగా గాలికొదిలేసి ఇలాంటి పనులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది సాంప్రదాయం కాదు.. అత్యంత అసహ్యకరమైన, మురికి పని, ఇలాంటి బ్రెడ్ తింటే రోగాలు రావడం ఖాయం, వ్యూస్ కోసం ఇంత దిగజారాలా? అంటూ నెటిజన్లు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

సాధారణంగా కొన్ని పాశ్చాత్య దేశాలలో ద్రాక్ష రసం తీయడానికి (Wine తయారీలో) కాళ్లతో తొక్కే పద్ధతి పూర్వం ఉండేది. కానీ, నేరుగా తినే బ్రెడ్ పిండిని ఇలా కాళ్లతో తొక్కడం మాత్రం ఎక్కడా ఆమోదయోగ్యం కాదని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. కాళ్లకు ఉండే బ్యాక్టీరియా, చెమట ఆహారంలో కలవడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో నెగెటివ్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us