Viral: షాకింగ్.. విపరీతమైన జలుబు.. కట్ చేస్తే.. 20 ఏళ్ల గతాన్ని మర్చిపోయిన మహిళ

|

Feb 25, 2022 | 9:00 AM

జలుబు చేస్తే చాలా చిరాగ్గా, అలసటగా ఉంటుంది. వర్క్ ప్లేసెస్‌లో అయితే మరింత ఇబ్బంది ఉంటుంది. కొందరికి జలుబు కారణంగా జ్వరం, బాడీ పెయిన్స్ కూడా వస్తాయి.

Viral: షాకింగ్.. విపరీతమైన జలుబు.. కట్ చేస్తే.. 20 ఏళ్ల గతాన్ని మర్చిపోయిన మహిళ
Claire Muffett Reece
Follow us on

Memory Loss With Cold: జలుబు చేస్తే చాలా చిరాగ్గా, అలసటగా ఉంటుంది. వర్క్ ప్లేసెస్‌లో అయితే మరింత ఇబ్బంది ఉంటుంది. కొందరికి జలుబు కారణంగా జ్వరం, బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. ఇదంతా కామన్.. కానీ జలుబు వల్ల గతాన్ని మర్చిపోవడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. అవునండీ బాబు.. లండన్‌(London)లో తాజాగా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. అక్కడ నివసిస్తున్న క్లైర్ మఫెట్ అనే 43 ఏళ్ల  మహిళ ఈ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది.  క్లైర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2021లో ఓ రోజు ఆమె కొడుకుకు బాగా జలుబు చేసింది. జలుబు అంటువ్యాధి అన్న విషయం తెలిసిందే. దీంతో ఆ తర్వాతి రోజు క్లైర్‌కు కూడా జలుబు బారిన పడింది. ఆ జలుబు రాత్రికి తీవ్రంగా మారింది. ఈ క్రమంలోనే ఊహించని విధంగా ఆమె కోమాలోకి వెళ్లింది. కంగారుపడ్డ కుటుంబ సభ్యులు వెంటనే క్లైర్‌ను ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. దీంతో మృత్యువును తప్పించుకోగలిగింది.   కానీ, తనని తాను మరిచిపోయింది. దాదాపు 20 ఏళ్ల గతాన్ని మర్చిపోయింది.  తాజాగా ఆమె తన భర్త స్కాట్‌తో కలిసి ‘చానల్ 4’ టీవీ చానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది క్లైర్ మఫెట్.

తనకు ఇప్పటికీ చాలా విషయాలు గుర్తు రావడం లేదని తెలిపింది. తనకు జలుబు వల్ల.. మెదడులో రక్తస్రావం జరిగి.. మెదడు వాపు సమస్య ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారని ఆమె వివరించింది. దాని ప్రభావం వల్ల ఆమె సుమారు 16 రోజులు కోమాలోనే ఉందట. కోమా నుంచి కోలుకున్న తర్వాత ఆమె చాలావరకు గతాన్ని మర్చిపోయింది.

Also Read: కళ్లు చెదిరే ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ.. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్’

అన్నం పాత్రలో ఉడికించితే మంచిదా..? ప్రెజర్ కుక్కర్‌లో వండితే మంచిదా?