Viral: ఆస్పత్రికి వచ్చిన మహిళకు స్కానింగ్ చేసిన డాక్టర్లు.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్!

|

Apr 15, 2022 | 5:28 PM

ప్రపంచం ఎన్నో వింతలూ-విశేషాలకు నిలయం. ఎప్పుడూ ఏదొక అంశం వైరల్ అవుతూనే ఉంటుంది. వాటిల్లో కొన్ని వింటుంటే..

Viral: ఆస్పత్రికి వచ్చిన మహిళకు స్కానింగ్ చేసిన డాక్టర్లు.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్!
Operation
Follow us on

ప్రపంచం ఎన్నో వింతలూ-విశేషాలకు నిలయం. ఎప్పుడూ ఏదొక అంశం వైరల్ అవుతూనే ఉంటుంది. వాటిల్లో కొన్ని వింటుంటే.. అవునా.! నిజంగా ఇలా జరిగిందా.? అని అనిపించేలా ఉంటుంది. మరికొన్ని వింటుంటేనే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు చెప్పబోయేది అలాంటి ఓ సంఘటన. ఇది మలేషియాలో చోటు చేసుకుంది. అదేంటో చూస్తే మీరు అస్సలు నమ్మలేరు.

సాధారణంగా జంతువులకు కొమ్ములు ఉంటాయని వింటుంటాం. అయితే ఇక్కడొక మహిళకు కొమ్ములు శరీరంలో నుంచి పొడుచుకుని వచ్చాయి. అది పెరుగుతూపోతూ ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డైలీ మెయిల్‌లో వచ్చిన ఓ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

63 ఏళ్ల మలేషియన్ మహిళకు ఛాతీపై కొమ్ము ఎదగడం మొదలుపెట్టింది. మొదట్లో వాటి గురించి ఆమె పెద్దగా పట్టించుకోకపోయినా.. అది క్రమక్రమంగా పెరుగుతూపోయింది. అంతేకాకుండా దాని చుట్టూ ఆమెకు దురద రావడం మొదలయ్యి.. ఇంకా ఇబ్బంది కలుగుతుండటంతో వెంటనే డాక్టర్‌ను సంప్రదించింది. ఆ ‘మిస్టిరియస్ హార్న్’ దాదాపుగా 5 సెం.మీ(2 inch) పొడవు పెరిగింది. డాక్టర్లు మొదట దీన్ని క్యాన్సర్ అనుకుని.. కొన్ని టెస్టులు నిర్వహించారు. అయితే రిపోర్ట్స్‌లో అది క్యాన్సర్ కాదని తేలింది. సదరు మహిళ ఛాతీపై ఉన్న చర్మం, వెంట్రుకలు, గోళ్లలో ఉండే ఏదో ప్రొటీన్‌ లోపం ఏర్పడటమే కాకుండా.. రేర్ స్కిన్ ఇన్ఫెక్షన్ సోకడంతో ఇలా కొమ్ములు పొడుచుకొచ్చాయని డాక్టర్లు చెప్పారు. చివరికి వాటిని ఆపరేషన్ చేసి తొలగించి ఆమెకు విముక్తిని కలిగించారు.