Viral: సైకిల్‌పై యువతి షికారు.. ఎదురైన రెండు మొసళ్లు.. ఆపై.ఏం జరిగిందంటే.! షాకింగ్ వీడియో..

Encounter with Alligators: సాధారణంగా ఎదురుగా మొసలి నిలబడితేనే భయంతో ఆమడదూరం పరిగెత్తుకుని పారిపోతాం...

Viral: సైకిల్‌పై యువతి షికారు.. ఎదురైన రెండు మొసళ్లు.. ఆపై.ఏం జరిగిందంటే.! షాకింగ్ వీడియో..
Alligator 1

Updated on: May 01, 2021 | 12:47 PM

Encounter with Alligators: సాధారణంగా ఎదురుగా మొసలి నిలబడితేనే భయంతో ఆమడదూరం పరిగెత్తుకుని పారిపోతాం. అలాంటి రెండు మొసళ్లు అకస్మాత్తుగా మన దారిలో అడ్డంగా వస్తే.. ఇంకేమైనా ఉందా.? గుండె జారిపోతుంది. సరిగ్గా ఇదే సంఘటన అమెరికాలో జరిగింది. ఓ మహిళా సైకిలిస్టు.. సైకిలింగ్ చేస్తుండగా.. అనుకోని అతిధులుగా మొసళ్లు ఆమె దారిలో అడ్డంగా వచ్చాయి. దీనికి సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అమెరికాలోని ఫ్లోరిడాలో బ్రెండా స్టెల్జెర్ అనే యువతి నేపుల్స్‌లోని బర్డ్ రూకీ స్వాంప్ అభయారణ్యం సైకిలింగ్ చేస్తోంది. ఇంతలో, రెండు మొసళ్లు అకస్మాత్తుగా ఆమె మార్గంలో వచ్చాయి. ఇంచక్కా రెండూ కూడా ఆ రోడ్డు మార్గంలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇక కొద్దిసేపటి తర్వాత పక్కనే ఉన్న నదిలోకి వెళ్లిపోయాయి. అప్పుడు ఆ మహిళా సైకిలిస్టు బ్రతుకు జీవుడా.. అనుకుంటూ అక్కడ నుంచి. వెళ్ళిపోయింది. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఒకింత షాక్ కావడమే కాకుండా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Read also:

Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!

 కరోనాతో మరణిస్తే రూ. 2 లక్షలు వస్తాయా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..!

Loading...
Unable to load recommendations.
Follow Us