AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాటర్ బాటిళ్లపై ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? చాలా మందికి తెలియని ఆసక్తికరమైన సైన్స్..!

Water Bottle Ridges Meaning: మనం నిత్యం చూసే చిన్న విషయాల వెనుక కూడా ఎంతో సాంకేతికత దాగి ఉంటుందనడానికి ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లే ఒక చక్కని ఉదాహరణ. కేవలం అందం కోసం అనుకునే ఆ గీతలు, బాటిల్ మన్నికను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇకపై మీరు వాటర్ బాటిల్ కొన్నప్పుడు ఈ గీతల వెనుక ఉన్న సైన్స్ ఖచ్చితంగా మీ గురుతుకు వస్తుంది.

వాటర్ బాటిళ్లపై ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? చాలా మందికి తెలియని ఆసక్తికరమైన సైన్స్..!
Water Bottle Ridges Meaning
Venkata Chari
|

Updated on: Jul 04, 2026 | 6:40 AM

Share

Water Bottle Ridges Meaning: మనం ప్రతిరోజూ కొనుగోలు చేసే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై వంకర గీతలు లేదా డిజైన్లు ఉండటం గమనించే ఉంటాం. చాలామంది ఇవి కేవలం అందం కోసం అనుకుంటారు. కానీ, ఈ సాధారణ గీతల వెనుక అద్భుతమైన సైన్స్, బాటిల్ పాడవకుండా కాపాడే బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

కేవలం డిజైన్ కాదు.. బాటిల్ కిచ్చే ‘మహా బలం’..: సాధారణంగా మార్కెట్లో లభించే వాటర్ బాటిళ్లను ‘పాలిథిలిన్ టెరిఫ్తాలేట్’ (PET) అనే ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి, అలాగే తయారీ ఖర్చులను అదుపులో ఉంచడానికి కంపెనీలు చాలా సన్నని ప్లాస్టిక్ పొరను ఉపయోగిస్తాయి. ఒకవేళ ఈ బాటిళ్లపై ఎలాంటి గీతలు లేదా ఎత్తుపల్లాలు లేకపోతే, మనం చేత్తో పట్టుకోగానే అవి సులభంగా నలిగిపోతాయి. ఈ గీతలే బాటిళ్లకు అదనపు బలాన్ని చేకూరుస్తాయి.

చేతి నుంచి జారిపోకుండా అద్భుతమైన గ్రిప్..: ఈ గీతల వల్ల మరో పెద్ద ప్రయోజనం ఉంది. బాటిల్ ఉపరితలం నునుపుగా ఉంటే, నీళ్లు తాగేటప్పుడు లేదా ప్రయాణాల్లో చేతిలో నుంచి జారిపోయే ప్రమాదం ఉంది. బాటిల్‌పై ఉండే ఈ వంకర గీతలు మన చేతి వేళ్లకు మంచి పట్టును (గ్రిప్) ఇస్తాయి. తద్వారా తడి చేతులతో పట్టుకున్నా బాటిల్ అస్సలు జారదు.

ప్రయాణాల్లో ప్రెజర్‌ను తట్టుకునే రహస్యం..: ఉష్ణోగ్రత మారినా లేదా ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినా బాటిల్ లోపల ఉండే నీరు, గాలి విస్తరిస్తాయి లేదా కుంచించుకుపోతాయి. ఉదాహరణకు, మైదాన ప్రాంతంలోని ఫ్యాక్టరీ నుంచి పర్వత ప్రాంతాలకు బాటిళ్లను రవాణా చేసినప్పుడు లేదా ఎండలో పార్క్ చేసిన కారులో బాటిల్ ఉంచినప్పుడు లోపల ఒత్తిడి (ప్రెజర్) విపరీతంగా పెరుగుతుంది. బాటిల్‌పై ఉన్న గీతలు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ (అకార్డియన్) లాగా సాగుతూ ఆ ఒత్తిడిని తమలో ఇముడ్చుకుంటాయి. దీనివల్ల లోపల ఎంత ప్రెజర్ పెరిగినా బాటిల్ ఆకారం అస్సలు మారదు.

బ్రాండ్ స్టిక్కర్లు ఊడిపోకుండా..: ప్రతి వాటర్ బాటిల్‌పై కంపెనీలు తమ బ్రాండ్ స్టిక్కర్లను అంటిస్తాయి. బాటిల్ ఉపరితలంపై ఈ గీతలు ఉండటం వల్ల గ్లూ (బంక) చాలా బలంగా అంటుకుంటుంది. దీనివల్ల స్టిక్కర్లు ముడతలు పడకుండా, చిరిగిపోకుండా దీర్ఘకాలం ఉంటాయి. అంతేకాకుండా, ఫ్యాక్టరీలో వేడి ప్లాస్టిక్ చల్లబడే ప్రక్రియలో లోపలి గాలి సులభంగా బయటకు వెళ్ళడానికి కూడా ఈ డిజైన్ ఎంతగానో తోడ్పడుతుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us