AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడికి కూడా హార్ట్ బ్రేక్ అవుతుందా.. తోడు కోల్పోయినప్పుడు అవి చేసే పనులు తెలిస్తే నోరెళ్లబెడతారు..

మనిషిలాగే కోడి కూడా డిప్రెషన్‌లోకి వెళ్తుందంటే నమ్ముతారా? కుక్కలు, పిల్లుల మాదిరిగానే తమకంటూ ఒక తోడు, సమాజం కోరుకునే కోళ్లను ఒంటరితనం ఎంతలా కుంగదీస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జీవులుగా మారుతున్న కోళ్ల భావోద్వేగాలపై శాస్త్రవేత్తలు చెబుతున్న ఆసక్తికర నిజాలు ఇవే..

కోడికి కూడా హార్ట్ బ్రేక్ అవుతుందా.. తోడు కోల్పోయినప్పుడు అవి చేసే పనులు తెలిస్తే నోరెళ్లబెడతారు..
Why Chickens Get Depressed
Krishna S
|

Updated on: Aug 15, 2026 | 6:40 PM

Share

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1900 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయి. ఒకప్పుడు వీటిని కేవలం మాంసం, గుడ్ల కోసమే పెంచేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికా వంటి దేశాల్లో కుక్కలు, పిల్లుల మాదిరిగానే కోళ్లను కూడా ముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే పెరట్లో పెంచే కోళ్లలో కొన్ని చనిపోయి, చివరకు ఒకటే కోడి మిగిలితే అది తీవ్రమైన ఒంటరితనానికి, మానసిక ఒత్తిడికి గురవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిజానికి కోళ్లు సాధారణ పక్షులు కావు, అవి గుంపుగా కలిసి బతికే జీవులు. కోళ్లు తోటి పక్షులనే కాకుండా దాదాపు 100 మంది మనుషుల ముఖాలను కూడా గుర్తుంచుకోగలవు. కోడి ముక్కు చివర చాలా సున్నితమైన నరాలు ఉంటాయి. వస్తువులను తాకడం, రుచి చూడడం, పరిసరాలను తెలుసుకోవడం అంతా ముక్కుతోనే చేస్తాయి. నేలలో ఆహారాన్ని వెతకడం, ఒంటిపై మట్టి చల్లుకోవడం వంటి మంచి అలవాట్లను తోటి కోళ్లను చూసే నేర్చుకుంటాయి. తోడు లేకపోతే కోళ్లు నైరాశ్యంలోకి వెళ్లిపోతాయి. తీవ్రమైన ఒత్తిడి వల్ల తమ ఈకలను తామే పీక్కోవడం ప్రారంభిస్తాయి.

కోడి ఒంటరిగా బాధపడుతుందని గుర్తించడం ఎలా?

తోటి కోళ్లు దూరమైనప్పుడు వాటి ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు వస్తాయి.

ఆగకుండా అరవడం: తప్పిపోయిన తోడు కోసం గట్టిగా, దీనంగా అరవడం.

కదలకుండా కూర్చోవడం: ఎలాంటి ఉత్సాహం లేకుండా ఒకే దగ్గర స్తబ్దుగా ఉండిపోవడం.

గుడ్లు పెట్టడం ఆగిపోవడం: ఒత్తిడి పెరగడం వల్ల గుడ్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడం.

తిండి మానేయడం: తిండి, నీళ్లు తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గి నీరసించిపోవడం.

పరిష్కారం ఏమిటి?

ఒంటరిగా మిగిలిన కోడి ఆరోగ్యాన్ని కాపాడాలంటే దానికి వెంటనే తోడును తీసుకురావాలి. అయితే కొత్త కోళ్లను కలిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ఒక్కదాన్నే తేకూడదు: కొత్తగా తెచ్చేటప్పుడు ఒక్క కోడిని కాకుండా కనీసం రెండు లేదా మూడు కోళ్లను జంటగా తేవాలి. దీనివల్ల పాత కోడి కొత్తవాటిపై దాడి చేసే అవకాశం తగ్గుతుంది.

కొన్ని రోజులు విడిగా ఉంచాలి: కొత్త పక్షులకు ఏవైనా రోగాలు ఉన్నాయేమో చూసేందుకు కొద్ది రోజులు వేరే గూటిలో ఉంచాలి. రెండూ ఒకదానినొకటి చూసుకునేలా పక్కపక్కనే ఉంచితే, కొద్ది రోజుల్లో అలవాటు పడతాయి. కాగా కోళ్లకు కూడా భావాలు, సమాజం ఉంటాయని గుర్తించి, అవి ఒంటరిగా మిగిలినప్పుడు సరైన తోడును ఏర్పాటు చేయడం ఎంతో అవసరం.

Follow Us
ఈ అడవిలోకి అడుగుపెడితే చావే.. OTTలోని ఈ మిస్టరీ థ్రిల్లర్ చూశారా?
ఈ అడవిలోకి అడుగుపెడితే చావే.. OTTలోని ఈ మిస్టరీ థ్రిల్లర్ చూశారా?
బాడీలో ఉన్న షుగర్ మొత్తాన్ని తుక్కు చేసే పవర్ వీటికే మాత్రమే
బాడీలో ఉన్న షుగర్ మొత్తాన్ని తుక్కు చేసే పవర్ వీటికే మాత్రమే
శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల బుకింగ్‌పై టీటీడీ క్లారిటీ
శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల బుకింగ్‌పై టీటీడీ క్లారిటీ
ఆనాటి పల్లెటూరు ఇలా ఉండేది! 90ల మధుర జ్ఞాపకాలు
ఆనాటి పల్లెటూరు ఇలా ఉండేది! 90ల మధుర జ్ఞాపకాలు
వందే భారత్ లోకో పైలట్లకు ప్రత్యేక శిక్షణ ఎక్కడ ఇస్తారో తెలుసా..?
వందే భారత్ లోకో పైలట్లకు ప్రత్యేక శిక్షణ ఎక్కడ ఇస్తారో తెలుసా..?
పితృ పక్షంలో ఇల్లు, భూమి ఎందుకు కొనకూడదంటారు?
పితృ పక్షంలో ఇల్లు, భూమి ఎందుకు కొనకూడదంటారు?
బిడ్డ పుట్టాక భర్తలను ఆడవాళ్లు ఎందుకు అసహ్యించుకుంటారు?
బిడ్డ పుట్టాక భర్తలను ఆడవాళ్లు ఎందుకు అసహ్యించుకుంటారు?
ఒక కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలి..? చిట్టి గుండె గట్టిగా..
ఒక కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలి..? చిట్టి గుండె గట్టిగా..
ఎంత రుద్దినా బకెట్ మరకలు పోవడం లేదా? ఇలా చేయండి!
ఎంత రుద్దినా బకెట్ మరకలు పోవడం లేదా? ఇలా చేయండి!
నాని 'ది ప్యారడైజ్'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?