
వైన్ ప్రియులకు ఒక సామెత బాగా తెలుసు.. వైన్ పాతబడే కొద్దీ దాని రుచి, విలువ పెరుగుతాయి అని. సాధారణంగా వైన్ బాటిళ్లను భూగర్భ గదుల్లో (Wine Cellars) లేదా చెక్క పీపాలలో భద్రపరుస్తుంటారు. కానీ, స్పెయిన్ దేశంలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. అక్కడ వైన్ తయారీదారులు బాటిళ్లను ఏకంగా సముద్ర గర్భంలో పడేసి, సంవత్సరాల తరబడి నిల్వ ఉంచుతున్నారు. ఈ అండర్‌వాటర్ వైన్ ఏజింగ్ (Underwater Wine Aging) వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్, దాని ప్రత్యేకతలు ఇక్కడ చూద్దాం..
నిజానికి వందల ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన నౌకల శకలాల నుండి బయటపడిన పాత వైన్ బాటిళ్లను పరిశోధకులు రుచి చూడగా, అవి అద్భుతమైన రుచితో ఉన్నట్లు తేలింది. ఈ ఆలోచనతోనే స్పెయిన్‌లోని కొన్ని ప్రముఖ కంపెనీలు సముద్రపు నీటిని సహజ వైన్ సెల్లార్‌గా మార్చేశాయి. సముద్రంలో దాదాపు 20 నుండి 40 మీటర్ల లోతులో ప్రత్యేకమైన పంజరాలలో (Cages) ఈ వైన్ బాటిళ్లను ఉంచుతారు.
సముద్ర గర్భంలో ఉండే వాతావరణం వైన్ త్వరగా పరిపక్వం (Mature) చెందడానికి అద్భుతంగా సహాయపడుతుంది. సముద్రపు అలల వల్ల బాటిళ్లు ఎల్లప్పుడూ మెల్లగా కదులుతూ ఉంటాయి. ఇది వైన్‌లోని మూలకాలు బాగా కలవడానికి దోహదపడుతుంది. సముద్రం అడుగున సూర్యరశ్మి (కాంతి) ఉండదు, అలాగే ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉంటుంది. నీటి లోపల ఉండే సహజ ఒత్తిడి (Atmospheric Pressure) వల్ల వైన్ చాలా సాఫ్ట్‌గా మరియు రిచ్ టేస్ట్‌తో తయారవుతుంది.
భూమిపై 3-4 సంవత్సరాలు పట్టే ప్రక్రియ సముద్రం లోపల కేవలం ఒకట్రెండు ఏళ్లలోనే పూర్తవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ బాటిళ్లను సముద్రం నుండి బయటకు తీసినప్పుడు వాటిపై నాచు, చిన్న చిన్న శంఖాలు, సముద్రపు జీవుల గుర్తులు అంటుకుని ఒక విభిన్నమైన యాంటిక్ లుక్‌ను ఇస్తాయి. ప్రతి బాటిల్ డిజైన్ ప్రకృతి సిద్ధంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది.
ఈ వైన్‌కు మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. వీటిని సముద్రం లోపలికి పంపడానికి, తిరిగి సురక్షితంగా బయటకు తీయడానికి స్కూబా డ్రైవర్ల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శ్రమ, పరిమిత లభ్యత, అద్భుతమైన రుచి కారణంగా ఈ వైన్ బాటిళ్లు అంతర్జాతీయ మార్కెట్‌లో లక్షల రూపాయల ధరలకు అమ్ముడవుతాయి. శతాబ్దాల నాటి వైన్ తయారీ సంప్రదాయానికి ప్రకృతి శక్తులను జోడించి స్పెయిన్ చేస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతోంది!
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..