Viral Video: ప్రేమంటే ఇదేరా.. రోజూ అన్నం పెట్టే అవ్వకు జ్వరమొచ్చిందని.. !

ఈ రోజుల్లో మనుషులు ప్రేమలు, అభిమానాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో, ఎంత కరెక్ట్‌గా ఉంటున్నాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. మితిమీరిన తెలివితేటలు...

Viral Video: ప్రేమంటే ఇదేరా.. రోజూ అన్నం పెట్టే అవ్వకు జ్వరమొచ్చిందని.. !
Langur Love On Old Women

Updated on: Jul 07, 2021 | 5:49 PM

ఈ రోజుల్లో మనుషులు ప్రేమలు, అభిమానాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో, ఎంత కరెక్ట్‌గా ఉంటున్నాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. మితిమీరిన తెలివితేటలు మనిషిని రోజురోజుకు దిగజార్చుతున్నాయి. అయితే యానిమల్స్ తమ నిబద్దతను అదే స్థాయిలో కాపాడుకుంటూ వస్తున్నాయి. టైమ్‌కి ఫుడ్ పెట్టి, కాస్త కేర్  చూపిస్తే చాలు.. అవి జీవితం మొత్తం విశ్వాసం చూపిస్తాయి. జంతువులు కల్మషం లేకుండా ప్రేమను ఎలా చూపిస్తాయో తెలియజేసే ఘటనలు ఇప్పటికే చాలా చూశాం. తాజాగా అలాంటి వీడియోను మీ ముందుకు తీసుకువచ్చాం. ఓ కొండముచ్చు తనకు రోజూ అన్నం పెట్టే అవ్వ అనారోగ్యానికి గురవ్వడంతో తట్టుకోలేకపోయింది. ఇంట్లోకి వెళ్లి..  మంచంపై పడుకున్న ఆమె వద్దకు వెళ్లింది. కష్టంలో తాను తోడుంటానన్నట్లు.. రెండు మూడుసార్లు బామ్మను హత్తుకుని ఓదార్చింది. ఆ బామ్మ కూడా దాన్ని ప్రేమగా వీపు నిమురుతూ సంతోషించింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు అయితే తెలియవు కానీ, సదరు వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ అవ్వ రోజూ కొండముచ్చుకు ఆహరం పెట్టేదని, ఆమె అనారోగ్యానికి గురికావడంతో అది అలా తన ప్రేమను వ్యక్తం చేస్తూ.. ఆమెకు ధైర్యం చెప్పిందని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ వీడియో మనుషులకు, జంతువులకు మధ్య ఉండే బంధాన్ని తెలియజేస్తుంది. ఏదైతేనేం… మనం ఇతర జీవులపై ప్రేమను చూపిస్తే.. అవి కూడా మనకు ప్రేమను తిరిగిస్తాయని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం.

ఆ వీడియోను దిగువన చూడండి…

Also Read: ఏపీలో కొత్తగా 3,166 కరోనా పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

 ఆఫ్ట్రాల్ ఫోన్ నంబర్ కోసం సూసైడ్ వరకూ వెళ్లాడు.. పిచ్చా..? వెర్రా..?

 

Loading...
Unable to load recommendations.
Follow Us